ప్రజలకు, న్యాయం జరగకుంటే వారి పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ పార్టీ ఆవిర్భావ సమయంలో గొప్పలు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమై పోయారని ప్రశ్నించారు.ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్.
సోమవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నా, సాధారణ ప్రజలకు చేరటంలేదని తెలిసినా తెలుగుదేశం పార్టీతో లాలూచీ ఎందుకని నిలదీసారు.వేల కోట్ల ప్రజాధనం ఏపిలో దుర్వినియోగం అవుతున్నా, పవన్‌కు కనిపించదెందుకని ఎద్దేవా చేసారాయన.
తన భార్యలకు, పుట్టిన బిడ్డకు కూడా న్యాయం చేయలేదంటూ తనపై వార్తలు వస్తున్నా స్పందించని వ్యక్తి జనం కోసం ఏం చేస్తాడని వ్యాఖ్యానించారు.
ప్రజల పక్షాన పోరాడతానని గొప్పలు చెప్పుకున్న జనసేన అధినేత అధికారపక్షంతో కుమ్మక్కయినందునే వారికి వ్యతిరేకంగా కనీసం వ్యాఖ్యానించలేక పోతున్నారని ఆరోపించారు.
జనం సమస్యలు గాలికొదిలేసిన పవన్‌కు అడపా దడపా మీడియా ముందుకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడేదానికి పార్టీ ఎందుకని ఎద్దేవా చేసిన ఆయన పవన్ తను స్థాపించిన జనసేన పార్టీని రద్దు చేసుకోవాలని వ్యఖ్యానించారు.







