హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం ఉండదని, వినాయక సాగర్ పేరుతో మరో పెద్ద చెరువు తవ్వస్తామంటూ బీరాలు పలికిన తెలంగాణా సర్కారు తరువాత ఎందుకనో చేతులెత్తేసింది.అధికార పగ్గాలు చేపట్టి రేండేళ్ల అయినా ఈ విషయమై అతీకతీ లేదు.
ఈ క్రమంలో ఈ సారి వినాయక నిమజ్జనాలు హుసేన్ సాగర్‌లో జరపించ బోమని, నిమజ్జన ప్రక్రియను ప్రత్యేక చెరువులల్లో మాత్రమే చేపడతామని స్పష్టమైన హామీని హైకోర్టుకు ఇచ్చింది.దీనికి తోడు ఈ సారి నిమజ్జనం ఊరేగింపు మార్గాలను ఎక్కడివక్కడ మార్చనున్నామని తెలియజేసింది.
వినాయక చవితి దగ్గర పడుతున్నా, ఇప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు చేయని సర్కారు తనకు నచ్చిన విధంగా హైకోర్టుకు వివరించడం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని, సంప్రదాయానుసారం ఈసారీ హుస్సేన్ సాగర్ లో మాత్రమే ప్రధాన నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నేత భగవంతరావు స్పష్టం చేశారు.అన్ని చెరువుల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని సూచించింది మినహా హుస్సేన్ సాగర్ ను వాడుకోరాదని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని, చెప్పడంతో ఈ సారినిమజ్జనం ఏ తరహాలో జరుగుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
చూడాలి మరి ఏం జరగనుందో?







