వైరల్ వీడియో: పిడుగుపాటుకు గురైన ద్వారక దేవాలయం..?!

అసలే ఇప్పుడు వర్షాకాలంవర్షాలు కూడా బాగా దంచి కొడుతున్నాయి.వర్షకాలం వర్షాలు పడక ఎండ వస్తుందని చాలామంది అనుకోవచ్చు.

కానీ ప్రకృతి వైపరీత్యమో, మరి ఏంటో తెలియదు కానీ వర్షాలతో పాటు పిడుగులు కూడా బాగా పడుతున్నాయి.ఈ ఏడాది పిడుగుటుకు దాదాపు 90మంది వరకు ప్రాణాలు కోల్పోయారు మన దేశంలో.

యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో పిడుగులు బాగా పడ్డాయి.ఈ క్రమంలో గుజరాత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ కృష్ణ దేవాలయం సమీపంలో కూడా పిడుగు పడింది.

ఈ పిడుగు పడే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.పిడుగు పాటుకు ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ శ్రీ కృష్ణ దేవాలయంపై ఉండే జెండా మాత్రం పిడుగు పాటుకు గురయింది.

Advertisement
Dwarka Temple Struck By Lightning Viral Video, Viral Latest, Social Media, Vir

అయితే విచిత్రం ఏంటంటే పిడుగు పాటుకు ఆలయ నిర్మాణం గాని చుట్టూ ఉన్న ఇళ్లకు గాని, మనుషులకు గాని ఏ విధమైన హాని జరగలేదు.ద్వారకలో ఉన్న కిట్టయ్య ఆలయానికి 1200ల సంవత్సరాల పురాతన చరిత్ర ఉందిఅలాంటి చరిత్ర ఉన్న ఆలయ నిర్మాణం చెక్కు చెదరలేదు గాన గుడి పైభాగాన ఉండే జెండా మాత్రమే చిరిగిపోయింది.

అలాగే ఆ పిడుగు పాటుకు ఆలయ గోడలు కొద్దిగా నల్లరంగుకు మారాయి.దేవాలయం చుట్టూ ఎన్నో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

Dwarka Temple Struck By Lightning Viral Video, Viral Latest, Social Media, Vir

కానీ వారికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడం మరో విశేషం.దీనిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూఅంత పెద్ద పిడుగు పడినా మాలో ఒక్కరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు.అంతా ఆ శ్రీ కృష్ణుని మాయేఆ ద్వారకమయుడే మమ్మల్ని కాపాడాడు అని అంటున్నారు.

భారత్ లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఈ శ్రీకృష్ణ ఆలయం కూడా ఒకటి.ద్వారకలోని గోమతి నది ఒడ్డున ఉంది ఈ ఆలయం.ఇక ఈ ఆలయంపై ఎగిరే జెండాకు చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది.52 గజాల ఈ జెండాను రోజుకు 3 సార్లు ఎగురవేస్తారట .ప్రస్తుతం ద్వారకలో కృష్ణుని ఆలయం వద్ద పిడుగుపాటు పడిన వీడియో బాగా వైరల్ అయింది.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు