రష్మిక సగానికి తగ్గించిందట.. ఐనా వస్తున్న ఆఫర్లు కొన్నే

నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ మరియు నార్త్ లో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.పాన్ ఇండియా హీరోయిన్ అంటూ అంతా కూడా ఈ ముద్దుగుమ్మ ను ఆకాశానికి ఎత్తారు.

 Due To Remuneration Rashmika Mandanna Not Getting Big Offers , Remuneration , P-TeluguStop.com

పుష్ప సినిమా సక్సెస్ తో పాటు హిందీ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాను అనే ఉద్దేశం తో తన రెమ్యూనరేషన్ ని ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు పెంచేసింది.హిందీ తో పాటు ఏ భాష లో నటించాలన్నా కూడా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ ఇవ్వాల్సిందే అంటూ ఈ అమ్మడు పట్టు పట్టింది.

దాంతో ఫిలిం మేకర్స్ ఈ అమ్మడి ని పట్టించుకోవడం మానేశారు అనే టాక్‌ మొదలు అయ్యింది.షాకింగ్ గా ఈ అమ్మడికి గత ఏడాది కాలం గా పెద్దగా ఆఫర్లు లేవు.

పుష్ప భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత బ్యాక్ బ్యాక్ సినిమాలను చేయక పోవడానికి కారణం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

రష్మిక భారీగా రెమ్యూనరేషన్ పెంచింది అనే ప్రచారం జరగడం తో కొంత మంది నిర్మాతలు ఆమె ను కనీసం సంప్రదించకుండానే మరో హీరోయిన్ తో కమిట్ అవుతున్నారు.దాంతో రష్మిక మందన తన రెమ్యూనరేషన్ ని సగానికి కుదించుకున్నట్లుగా తెలుస్తోంది.ఒక కన్నడ మీడియా లో వచ్చిన కథనం అనుసారం రష్మిక రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కి ఓకే చెప్పి సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

పారితోషికం తగ్గించుకోవడం తో రష్మిక ఇక ముందు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతానికి అయితే రెండు కోట్ల రూపాయలకు సినిమా లు చేస్తాను అంటూ ప్రకటించినా కూడా ఆఫర్లు వరుసగా వస్తున్నట్లుగా అయితే కనిపించడం లేదు.ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube