భారత వలస వాసులకు దుబాయ్ తీపి కబురు..కానీ ఆ బాధ్యత మాత్రం...

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంతో ఆ సమయంలో భారత్ నుంచీ లేదా ఇతర దేశాల ఉంచి దుబాయ్ దేశానికి వెళ్ళే వారు కానీ లేదా దుబాయ్ నుంచీ వచ్చి భారత్ లో ఉండిపోయిన వారు కానీ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కున్నారు.

ఈ క్రమంలోనే ఎంతో మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు.

అయితే కరోనా క్రమేపీ తగ్గుతుండటంతో కొన్ని నిభందనలు విధిస్తూ తమ దేశంలోకి అనుమతులు ఇచ్చింది.ఈ నిభందనలలో భాగంగానే RTPCR టెస్ట్ లు, ఏడు రోజుల పాటు క్వారంటైన్ టెస్ట్ లు చేయించుకునేలా ఆదేశాలు జారీ చేసింది.

కానీ తాజాగా ఈ నిభందనను కూడా దుబాయ్ తొలగించింది.భారత్ నుంచీ దుబాయ్ వెళ్ళే ముందు ఎయిర్ పోర్ట్ లో ముందుగానే RTPCR చేయించుకోవాల్సిన అవసరం లేదని దుబాయ్ ఎయిర్ పోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

కొత్తగా విధించిన నిభంధనల ప్రకారం. ఎయిర్ పోర్ట్ లోకి వచ్చిన తరువాత RTPCR టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు కానీ దుబాయ్ బయలుదేరే 72 గంటల ముందు చేయించాల్సిన RTPCR టెస్ట్ మాత్రం తప్పకుండ చేయించాలని అలాగే.

Advertisement

ఎయిర్ పోర్ట్ లోకి వచ్చిన తరువాత చేసే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించింది.ఈ నిభందనలు వలస వాసులు అత్యధికంగా వచ్చే భారత్ కు అలాగే ఇతర దేశాలైన శ్రీలంక , బంగ్లా, పాక్ దేశాలకు కూడా ఈ కొత్త రూల్స్ వర్తింపజేసింది దుబాయ్.అంతేకాదు దుబాయ్ మీదుగా ఇతర దేశాలకు వెళ్ళే వారికి కూడా ఈ తాజా నిభందనలు వరిస్తాయని తెలిపింది అంతేకాదు ప్రయాణీకులు కొత్త నిభందనలు తెలియజేసి అవి పాటించేలా చేయాల్సిన భాద్యత ఎయిర్ లైన్స్ మీద ఉందని స్పష్టం చేసింది.

నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా
Advertisement

తాజా వార్తలు