కన్నుమూసిన నిషికాంత్,శోకసంద్రంలో ఇండస్ట్రీ

కరోనా మహమ్మారి నేపథ్యంలో అటు ప్రజా ప్రతినిధులు,సినీ ప్రముఖులు ఒక్కొక్కరు మృతి చెందుతూ అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తున్నారు.

ఈ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం తో ఇప్పటి వరకు చాలామంది ప్రజా ప్రతినిధులు అలానే సినీ సెలబ్రిటీలు చాలా మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

వారందరి వరుస మరణాలు ప్రతిఒక్కరినీ కలచివేస్తున్నాయి.నిన్నటికి నిన్న మాజీ క్రికెటర్,యూపీ మంత్రి కరోనా కారణంగానే మృతి చెందగా, ఇంకా ఆ ఘటన గురించి చర్చించుకుంటుండగానే ఇప్పుడు మరో సినీ సెలబ్రిటీ, బాలీవుడ్ నిషికాంత్ కామత్ కరోనా కు బలైనట్లు తెలుస్తుంది.

Bollywood Director Nishikanth Passes Away ,Drushyam, Nishikanth Kamath, Ritesh D

గతనెలలో ఆయన కరోనా బారిన పడగా జులై 31 నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.అయితే రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించడం తో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

అయితే ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోవడం తో కొద్దీ గంటల క్రితం ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది.ఆయన ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఆయన పై అనేక రూమర్స్ వచ్చాయి.

Advertisement

ఆయన మృతి చెందారు అంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి.అయితే ఆయన ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు అటు ఆసుపత్రి వర్గాలు,బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ లు స్పష్టం చేసారు కూడా.

అయితే ఇంకా ఆ విషయంపై చర్చ జరుగుతుండగానే ఆసుపత్రి వర్గాలు అఫీషియల్ గా ఆయన మృతి చెందినట్లు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.దీనితో ఈ కరోనా కు మరో సినీ సెలబ్రిటీ బలైనట్లు తెలుస్తుంది.

ఈ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు ఎదురుకొంటున్నారు.కేంద్రమంత్రులు,మంత్రులు,ఎమ్మెల్యేలు,సినీ సెలబ్రిటీలు ఇలా ఒక్కొక్కరు కూడా కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు