ఈరోజుల్లో కొందరు డాక్టర్లు వీధి రౌడీలా ప్రవర్తిస్తూ వైద్య వృత్తికి మచ్చ తెస్తున్నారు.డాక్టర్ల దురుసు ప్రవర్తనకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి.
కాగా తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఒక డాక్టర్ మహిళా పేషెంట్ ని చితకబాదాడు.
రోగిగా చేరిన మహిళపై మద్యం మత్తులో ఉన్న ఈ వైద్యుడు ఆమె చితక్కొట్టాడు.వీటిలో కొన్ని దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్‌పై షోకాజ్ నోటీసు జారీ చేసింది.ఒకరోజు అర్థరాత్రి తన తల్లి సుఖమతి ఆరోగ్యం క్షీణించిందని పేషెంట్ కుమారుడు, గేర్వాణి గ్రామానికి చెందిన శ్యామ్‌కుమార్ తెలిపారు.108, 112కు ఫోన్ చేసినా సమయం పడుతుందని చెప్పారని, దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడం చూసి వెంటనే ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకొచ్చాడు.చికిత్స సమయంలో, వైద్యుడు తన తల్లిని కొట్టాడని ఆరోపించారు.
అతను ఈ చర్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపినప్పుడు మౌనంగా ఉండమని డాక్టర్ చెప్పాడట.
ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వైద్యుడిపై షోకాజ్ నోటీసు జారీ చేశామని మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు.ఈ అంశంపై తదుపరి విచారణ జరుగుతోందని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు డాక్టర్‌ని తిట్టుకొస్తున్నారు.
ఇలాంటి వైద్యులను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.