డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ పరీక్షలు.. ఎరుపు రంగు వస్తే అంతే సంగతులు..!!

మందు బాబులను ఎలాగయితే డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో టెస్టులు నిర్వహించి అరెస్ట్ చేస్తున్నారో అదే మాదిరిగా ఇకనుండి డ్రగ్స్ తీసుకున్న వారిని కూడా పసిగట్టే క్రమంలో వారికి కూడా డ్రగ్ టెస్టులు చేస్తారట.ఈ మధ్య కాలంలో డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య బాగా ఎక్కువ అయిపోయింది.

 Drug Tests Like Drunken Drive If It Turns Red , That S All , Drugs , Test , D-TeluguStop.com

మత్తు పదార్ధాలకు ఎంతో మంది బానిసలుగా మారి వారి బంగారు భవిష్యత్తును అగాధంలో గడిపేస్తున్నారు.ఇకమీదట వాళ్ళ ఆటలు చెల్లవు.

ఎందుకంటే డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.డ్రగ్స్ తీసుకునే వాళ్లను కనిపెట్టే క్రమంలో ఒక కొత్త టెక్నాలజీని వినియోగించున్నారు.

డ్రగ్ ఎనలైజర్లను ఉపయోగించి డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టబోతున్నారు.

కాగా ఈ డ్రగ్ ఎనలైజర్ టెస్ట్ ఎలా చేస్తారంటే డ్రగ్ తీసుకున్న వారి నోటిలోని లాలాజలంతో ముందుగా టెస్ట్ చేస్తారు.

అంతే కేవలం రెండంటే 2 నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది.సదరు వ్యక్తి డ్రగ్‌ తీసుకుంటే ఎరుపు రంగులో చుక్కలు కనిపిస్తాయి.లేకపోతే ఆకుపచ్చ రంగులో చుక్కలు కనిపిస్తాయి.ఎరుపు రంగు వస్తే పాజిటివ్ అని ఆకుపచ్చ రంగు వస్తే నెగటివ్ అని అర్ధం అన్నమాట.

ఈ టెస్ట్ లో సదరు వ్యక్తి ఎంత మోతాదులో డ్రగ్‌ తీసుకున్నారు? తీసుకొని ఎంత సేపు అవుతుంది అనే వివరాలు కూడా స్క్రీన్‌ మీద కనిపిస్తాయట.కాగా డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తి మూత్రం నమూనాలతో పాటు రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారు.

ఆ పరీక్షలతో డ్రగ్స్ తీసుకున్నది లేనిదీ అనేది కచ్చితంగా నిర్ధారణ చేస్తారు.ఇలాంటి డ్రగ్ ఎనలైజర్లను కొనుగోలు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

Telugu Drug Analyzer, Drug, Drugs, Drunk Drive, Gujarat, Hyderabad, Kerala, Red,

ఈ డ్రగ్ ఎనలైజర్లను ఉపయోగించి ఉమ్ము, మూత్రం శాంపిళ్లను సేకరించి నిమిషాల్లో డ్రగ్ టెస్ట్ చేసి వారిని గుర్తించడం చాలా సులభం.డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లాగే డ్రగ్స్ తీసుకునే వారిని కూడా కట్టడి చేసేందుకు ముఖ్య ప్రాంతాల్లో డ్రగ్ టెస్టులు చేయాలని భావిస్తున్నారు.ఇలాంటి టెస్టులను ఇప్పటికే కేరళ, గుజరాత్‌ పోలీసులు వినియోగిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి డ్రగ్‌ టెస్టులను హైదరాబాద్ పోలీసులు కూడా చేయాలనీ భవిస్తున్నారు.ఈ డ్రగ్ అనలైజర్ల ద్వారా గంజాయి, హష్‌ ఆయిల్, కొకైన్, హెరాయిన్‌ తీసుకున్న వారిని ఇట్టే గుర్తించవచ్చని పోలీసులు తెలిపారు.ప్రభుత్వ ఆమోదంతో డ్రగ్‌ ఎనలైజర్లను కొనుగోలు చేసి, ముందుగా ట్రయల్‌ రన్‌ నిర్వహించి ఆ తర్వాత సిబ్బందికి ట్రైనింగ్‌ ఈ డ్రగ్ ఎనలైజర్లను రాష్ట్రవ్యాప్తంగా వాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube