హైదరాబాద్ లో రూ.50000 కరోనా కి మందు దొరుకుతుందట...

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే కొందరు కేటుగాళ్లు ఈ విషయాన్ని అలుసుగా తీసుకొని క్యాష్ చేసుకునేందుకు దందాలు మొదలుపెట్టారు.

అయితే ఇటీవలే ఓ ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ కరోనా వైరస్ ని నియంత్రించే వ్యాక్సిన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ కరోనా వ్యాక్సిన్ ని కేవలం కరోనా వైరస్ సోకి బాధపడుతున్న వారికి మాత్రమే అందజేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది కేటుగాళ్లు వైద్యుల పేరు చెప్పి కొనుగోలు చేసి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారి వివరాలు తెలుసుకొని వారిలో భయాందోళనలు సృష్టిస్తూ 5 వేల రూపాయలు ఖరీదు చేసే ఈ వ్యాక్సిన్ ని దాదాపుగా 50 వేల రూపాయలకు పైగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.దీంతో తాజాగా హైదరాబాద్ నగర పోలీసులు పక్కా సమాచారంతో కొంత మంది కేటుగాళ్లని అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ వైద్యుల పేర్లతో మందులు కొనుగోలు చేసి భారీ మొత్తానికి విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు.

అంతేగాక లక్షల రూపాయల వ్యాక్సిన్ ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారాలను నమ్మి వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోవద్దు అంటూ ప్రజలకు సూచిస్తున్నారు.

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నమోదయినటువంటి కరోనా వైరస్ పాజిటివ్ గణాంకాలను పరిశీలించినట్లయితే  రాష్ట్ర  వ్యాప్తంగా  దాదాపుగా 36 వేల పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 326 మంది మృత్యువాత పడ్డారు.దాంతో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

Advertisement

అంతేకాక  లాక్ డౌన్ ని  ఈ నెల 31 వ తారీకు వరకు పొడిగిస్తున్నట్లు ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారికంగా ప్రకటన చేశారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు