కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య వేలల్లో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రాత్రిపూట మద్యం తాగి బండి నడిపేవారిని అడ్డుకునేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లను పోలీసులు నిర్వహిస్తూ ఉంటారు.
అలా రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే పోలీసులు అవాక్కయ్యేలా సంఘటన జరిగింది.ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డిసెంబర్ 31 రాత్రి లండన్‌లో పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.ఆ సమయంలోనే ఒక కారు చాలా పెద్ద శబ్దాలు చేసుకుంటూ దూసుకు వస్తోంది.వెంటనే ఆ కారును ఆపిన పోలీసులు అతడి ఆల్కహాల్ లెవల్స్‌ను పరిశీలించారు.ఏకంగా 196 శాతం ఆల్కహాల్ పర్సంటేజ్ చూపించింది.దానికే ఆశ్చర్యపోయిన పోలీసులకు మరో ఆశ్చర్యకర విషయం తెల్సింది.అదేంటీ అంటే ఆ కారుకు ముందు టైర్లు లేవు.
కేవలం రిమ్ములు మాత్రమే ఉన్నాయి.టైర్లు ఏమయ్యాయో తెలియకుండానే అతడు కారును డ్రైవ్ చేసుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు.

కారుకు టైర్లు లేని విషయం గుర్తించే స్థితిలో అతడు లేడు.ఏకంగా 10 కిలోమీటర్ల వరకు అతడు కారును 100 స్పీడ్‌తో వచ్చాడు.మామూలుగా టైర్ లేకుండా 10 లేదా 20 స్పీడ్ కూడా వెళ్లే పరిస్థితి ఉండదు.అలాంటిది ఏకంగా 100 స్పీడ్‌తో 10 కిలోమీటర్ల వరకు అతడు ప్రయాణించాడు.
మొదట అతడి లక్ బాగుందని చెప్పాలి.ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం తప్పింది.
ఇక అతడు ఏ స్థాయిలో మద్యం తాగి ఉన్నా కూడా కారును ఎక్కడ కూడా యాక్సిడెంట్ కాకుండా తీసుకు రాగలిగాడు.పోలీసులు అప్పటికి అయినా చూడకుంటే అతడు ఈపాటికి శవం అయ్యి ఉండేవాడేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.