బస్సు డ్రైవర్‌ని కాల్చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..

ప్రమాదాలు ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తాయో ఎవరూ ఊహించలేరు.అందుకే అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.

 Driver Shoots At Passenger Who Pulled Gun On Moving Bus Video Viral Details, Vir-TeluguStop.com

అయితే కొందరు మాత్రం ఏదో పరధ్యానంలో ఉంటూ లేక ప్రాణాలు కోల్పోతుంటారు.మరి కొందరు మాత్రం ఫుల్ అలర్ట్ గా ఉండి ప్రాణ గండం నుంచి బయటపడుతుంటారు.

తాజాగా ఒక బస్సు డ్రైవర్( Bus Driver ) కూడా సాయిధ దొంగ నుంచి చాకచక్యంగా బయటపడగలిగాడు.వైరల్ అవుతున్న వీడియోలో ఒక దొంగ లేదా క్రిమినల్ తన చేతిలో గన్ పెట్టుకొని( Gun ) కనిపించడం చూడవచ్చు.

ఆ తర్వాత అతడు బస్ డ్రైవర్ వద్దకు వెళ్లాడు.ఇవన్నీ గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అలెర్ట్ అయ్యాడు.

అనంతరం తన వద్ద ఉన్న తుపాకీ తీసి అతడి పై కాల్పులు ( Firing ) జరిపాడు.మధ్యలో ఒక గ్లాస్ ఉండటం వల్ల బుల్లెట్లకు గ్లాస్ ( Glass ) మాత్రమే పగిలింది.దొంగకి ఎలాంటి బుల్లెట్లు తగల్లేదు.అందువల్ల అతడు వెంటనే కింద పడిపోయి బస్సు పై పాకుతూ తన ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించాడు.బస్సు డ్రైవర్ బస్సు కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు.అయితే ఇదంతా బస్సులోని సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఇది చూసిన యాజమాన్యం ఆ డ్రైవర్ ను( Driver ) ఉద్యోగం నుంచి తీసేసిందట.ఈ విషయాన్ని వీడియో షేర్ చేసిన ట్విట్టర్ పేజీ lncmpltemission షేర్ చేసింది.అయితే ప్రొటెక్షన్ కోసం గన్ క్యారీ చేయడంలో తప్పు ఏమీ లేదని, ఉద్యోగంలో నుంచి తీసేసిన కంపెనీ పై డ్రైవర్ కేసు ఫైల్ వేసే వెసులుబాటు ఉంటుందని దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నార్త్ కరోలినాలో( North Carolina ) ఈ ఘటన జరిగినట్లు మరికొందరు పేర్కొన్నారు.

ఈ వైరల్ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube