సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరి విజయం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి.చేసిన ప్రతి పనిలో ఫెయిల్యూర్ ఎదురైతే చాలామంది నిరాశకు గురవుతూ ఉంటారు.
హర్ష్ జైన్( Harsh Jain ) అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పనిలో ఓటమిపాలయ్యారు.అయితే పట్టువదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం ప్రయత్నించి సత్తా చాటారు.అలుపెరగని పోరాటం చేసి కెరీర్ పరంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలన్న కలను సులభంగా నెరవేర్చుకున్నాడు.
డ్రీమ్11( Dream11 ) సంస్థ అధిపతి హర్ష్ జైన్ ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.ప్రస్తుతం ఇతని కంపెనీ టర్నోవర్ 65 వేల కోట్ల రూపాయలు కావడం గమనార్హం.1986 సంవత్సరంలో ముంబైలో( Mumbai ) జన్మించిన హర్ష్ జైన్ 2013 సంవత్సరంలో రచన షా( Rachana Sha ) అనే డెంటిస్ట్ ను పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు క్రిష్ అనే కొడుకు ఉన్నాడు.ప్రస్తుతం ఈ దంపతులు 72 కోట్ల రూపాయల విలువ గల లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్నారు.

హర్ష్ జైన్ 2010 జులై నెలలో ముంబైలో రెడ్ డిజిటల్( Red Digital ) అనే సోషల్ మీడియా ఏజెన్సీకి స్థాపించాడు.ఈ సంస్థను 2013 సంవత్సరంలో గోజూప్ అనే మార్కెటింగ్ ఏజెన్సీ కొనుగోలు చేయడం గమనార్హం.2019 సంవత్సరం ఏప్రిల్ లో డ్రీమ్11 కంపెనీ యునికార్న్ క్లబ్ లో ప్రవేశించిన మొదటి ఇండియన్ గేమింగ్ కంపెనీగా నిలిచింది.డ్రీమ్11 ప్రారంభ రోజులలో హర్ష్ జైన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

2017 సంవత్సరంలో హర్ష్ జైన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో పాటు డ్రీమ్11 యాప్ నేడు 8 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించడానికి కారణమయ్యాడు.మన దేశంలోని అత్యంత ధనవంతులైన యువ బిలియనీర్లలో హర్ష్ జైన్ ఒకరు కాగా ఈ ఫ్లాట్ ఫామ్ లో ప్రస్తుతం 150 మిలియన్స్ యాక్టివేట్ యూజర్స్ ఉన్నారని తెలుస్తోంది.







