డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ ఫోటోతో సహా డౌన్ లోడ్ చేసుకోండిలా..!

భారతదేశంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడీ కార్డ్( voter id card ) తప్పనిసరి అందరికీ తెలిసిందే.

అయితే ఇంట్లో కూర్చునే ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఫోటోతో కూడిన డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తోంది.

దేశ భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఓటు హక్కుకు మాత్రమే ఉంటుంది.కాబట్టి బాధ్యత గల భారత పౌరులుగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓటరుగా తప్పక నమోదు చేసుకోవాలి.

త్వరలోనే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే చాలావరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు, దొంగ ఓట్లను తొలగించే పనిలో ఎన్నికల సంఘాలు నిమగ్నం అయ్యాయి.

Advertisement

మనలో చాలామందికి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఓటర్ ఐడి కార్డు గుర్తుకు వస్తుంది.ఆ సమయంలో ఇంట్లో ఎక్కడ దాచి పెట్టామో చాలామందికి గుర్తు ఉండదు.ఇల్లంతా వెతికిన ప్రయోజనం ఉంటుందో, ఉండదో చెప్పలేము.

అలా అని ప్రతిసారి మన వెంట ఈ ఓటర్ కార్డును తీసుకువెళ్లలేము.ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే కేంద్ర ఎన్నికల సంఘం( Election Commission of India ) స్మార్ట్ ఫోన్లోనే ఫోటోతో కూడిన డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.

రెండేళ్ల క్రితమే ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్( Aadhaar Card ) మాదిరిగానే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.ముందుగా స్మార్ట్ ఫోన్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

ఆ వెబ్సైట్లో తమ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత ఏ రాష్ట్రానికి చెందినవారు ఆ వివరాలు సెలెక్ట్ చేయాలి.ఆ తర్వాత తమ ఓటర్ కార్డ్ నెంబర్ ను నమోదు చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?

రిజిస్టర్ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.ఆ తర్వాత డౌన్లోడ్ e-EPIC ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Advertisement

క్షణాల్లో తమకు నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్లో డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.దీనిని కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

తాజా వార్తలు