రిజర్వేషన్ దొరకలేదని చింతించకండి.. రన్నింగ్ ట్రైన్‌లో టికెట్ పొందొచ్చు..

భారతీయ రైళ్లలో ప్రయాణించే వారికి రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.వాటిలో ఒకే సీటు ఇద్దరు ప్యాసింజర్లకు కేటాయించడం ఒకటి.

 Don't Worry About Not Getting Reservation You Can Get Ticket In Running Train ,-TeluguStop.com

ఒక్కోసారి ప్రయాణికులు సీటు బుక్ చేసుకొని ఆ ట్రైన్ ఎక్కకుండా ఉంటారు.అప్పుడు ఆ సీట్ అనేది ఖాళీగా ఉండి పోతుంది.

దీనిని భర్తీ చేయడానికి టీసీ వచ్చి అన్నీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.దీనివల్ల ప్రయాణికులకు ఖాళీ సీట్స్‌లో కూర్చునే అవకాశం కూడా రాక ఇబ్బంది ఎదురవుతోంది.

అయితే ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.

ఈ సరికొత్త టెక్నాలజీతో ప్రయాణికులు నడుస్తున్న రైలులోనే కంఫర్మ్డ్‌ సీట్లలో కూర్చోగలుగుతారు.

అప్పుడు సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే ఉండదు.ఈ టెక్నాలజీ వినియోగం వల్ల, ప్రయాణీకులు రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ (ఆర్ఎసీ) టికెట్ కోసం వేచి ఉండటానికి లేదా కంఫర్మ్డ్‌ సీట్ విషయమై ట్రైన్ టికెట్ కలెక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

ఈ ఫెసిలిటీ రైల్వే హ్యాండ్ హోల్డింగ్ డివైజ్ (HHT) సాయంతో ట్రైన్‌ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంటుంది.

Telugu Indian Railway, Seat Vacancy, Ticket, Train-Latest News - Telugu

ఈ టెక్నాలజీ మెషిన్స్ ద్వారా సీట్ల ఖాళీల గురించి రియల్ టైమ్‌ సమాచారం ఈజీగా తెలుసుకోవచ్చు.ఆ విధంగా ఎవరి సహాయం అవసరం లేకుండా ప్రయాణికులకు నేరుగా సీట్ల కూర్చోవాలా వద్దా అనేది తెలుసుకోవచ్చు.ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చాక.

దీన్ని ఉపయోగించి రోజూ వేలాది మంది ప్రయాణికులు తమ సీట్లు, టిక్కెట్లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube