కరీంనగర్ ఎంపీ మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay ) కు వ్యతిరేకంగా ఆయన నియోజకవర్గంలోని కొంతమంది నాయకులు బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్ళగక్కడంతో పాటు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సంజయ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీ టికెట్ ఇవ్వొద్దు అంటూ కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేయడం సంచలనంగా మారింది.ప్రస్తుతం బండి సంజయ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు.అయితే బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో సహకరించమని, వేరే వారికి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజులు క్రితం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారట.

జిల్లాలో పార్టీని సంజయ్ సర్వ నాశనం చేశారని , పార్టీలోని సీనియర్ నాయకులకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని కొంతమంది నాయకులు ఆ సమావేశంలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారట.అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్నారట.ఇటీవల ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) పర్యటన సమయంలోను తమను కనీసం ఆహ్వానించలేదని, ఈ తరహా వ్యవహారాలు చేయడం వల్ల పార్టీకి సీనియర్ నాయకులు, కార్యకర్తలు దూరమవుతున్నారని, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ స్థానాన్ని బిజెపి గెలుచుకునేదని, కానీ సంజయ్ వ్యవహార శైలి కారణంగానే ఓడిందని వారు ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే తనుకు అనుకూలంగా ఉన్నవారితో లాబియింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించి ప్రధాన కార్యదర్శి పదవి ని దక్కించుకున్నారని వారు విమర్శిస్తున్నారు.అంతేకాదు బిజెపి సీనియర్ నాయకుడు రెడ్డి మురళీధర్ రావు, రాజేందర్( Etela Rajender ) , లక్ష్మణ్ వంటి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేయిస్తున్నారని ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.