దేవుణ్ణి సృష్టించింది మనిషేనని ముఖ్యమంత్రులకు తెలియదా?

ఈవిశ్వాన్ని దేవుడు సృష్టించలేదు , మనిషే తన ఆకారంలో దేవున్నిసృష్టించుకున్నాడు , అని 2500 సంవత్సరాల క్రితమే చార్వాకులు ఎలుగెత్తిచాటారు.ఆమాత్రం జ్ఞానము మననాయకులకు లెకపోవటం సిగ్గుచేటు.

 Don't The Chief Ministers Know That Man Created God ,  Chief Ministers , God ,ch-TeluguStop.com

ఈరొజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విలువలను కాలరాస్తు , యాదాద్రి గుట్టపై యాగాలు , ముహూర్తము , మంత్రాలతో కుటుంబసమేతంగా పూజలు చేయటం రాజ్యాంగములొని లౌకికవాదాన్ని పాతర చెయ్యటమే అవుతుంది.ఆయన దసరాకి కొత్తపార్టీ పెడతాడట .ఎవరిని ఉద్ధరించటానికి ? అధికారికంగా ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు చెయ్యకూడదని రాజ్యంగములో వ్రాసుకున్నా , ఆ సూత్రాలను తుంగలోతొక్కి ఈరకంగా ఒక ముఖ్యమంత్రి చేసాడంటే , అయన కొత్తపార్టీ ఏరకమైన విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ? కల్పితమైన పుక్కిటి పురాణాలకు , మనిషి సృష్టించుకున్న దేవుళ్ళకు ఒక ముఖ్యమంత్రి విలువయిస్తూ ఇలా చెయ్యటం మానవ విలువలకూ తిలోదకాలు ఇవ్వటమే కాగలదు.

ఒకప్రక్క శాస్త్రసాంకేతిక రంగాలతో ప్రపంచం ఎంతో ముందుకిపోతుంది.కానీ మనదేశంలో మాత్రం మత మౌఢ్యం , మూఢ నమ్మకాలతో ముందుకి పోతుంది.ప్రధాని మొదలుకుని అధికారుల వరకు అందరు మూఢ నమ్మకాలలో కూరుకపోయిన పరిస్థితి చూస్తున్నాము.

రాజ్యాంగములో శాస్త్రీయ అలోచన , ప్రశ్నించేతత్వం పెంచటం ప్రతిపౌరుని బాధ్యత అనిరాసుకున్నాము.ఆచరణలో ఎవరూపట్టించుకోరు.

పైగా ప్రశ్నిస్తే కేసులూ , అరెస్టులూ ఎటుపోతున్నాం మనం ? ఈరకంగా ముఖ్యమంత్రులు ప్రవర్తిస్తే దేశం ఏరకంగా ముందుకి పొతుంది ? ఈమద్య తమిళనాడులో ఒకపార్లమెంటు సభ్యుడు తాను వెళ్లిన కార్యక్రమంలో పురోహితుడు , టెంకాయలు , పూజలు ఉన్నపరిస్థితి చూసి , అక్కడి అధికారులకు క్లాస్ పీకాడు.మనది లౌకిక రాజ్యము , కనుక ఇలాంటివి ఉండకూడదు అని హెచ్చరించాడు.

మననాయకులు అలా ఉండటం నేర్చుకోవాలి.మొన్ననే ఏపి ముఖ్యమంత్రి తిరపతి వెంకన్నకు అధికారకంగా పట్టువస్త్రాలు సమర్పించాడు.

అంతకు ముందు ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సమయంలో సముద్రానికి పట్టువస్త్రాలు సమర్పించాడు.సముద్రం కూడా బట్టలు ధరిస్తుందా అని సామాన్యుడు సైతం నవ్వుకున్నారు .మాట్లాడితే మన నాయకులు దొంగస్వాములకు సాష్టాంగపడతారు.వారిచేత ముద్దులు పెట్టించుకుంటారు.

లౌకికరాజ్యంలో ఇలాచెయ్యటం రాజ్యాంగవిరుద్దము.తెలియనివారికి చెప్తే వింటారు.

తెలిసికూడా తెలియనట్లు నటించేవారికి ప్రజలే బుద్ధి చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube