భారతీయ మగవారు శృంగారం చేయరా అని ప్రశ్నిస్తున్న హీరోయిన్

ఇప్పుడు బాలివుడ్ లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, బాబుమొషాయ్ బందుక్ బాజ్.ఈ సినిమాలో ఖాన్స్, హృతిక్ లేరు.

అయినా నిత్యం వార్తల్లో ఉంటోంది‌‌‌.దానికి కారణం ఓ పెద్ద వివాదం.ఈ సినిమాకి ఒకటి కాదు, రెండు కాదు 48 కట్స్ చెప్పింది సెన్సార్ బోర్డ్.48 కట్స్ అంటే ఇక సినిమాలో ఏం మిగిలి ఉంటుంది ? ఈ సినిమాలోని శృంగార సన్నివేశాలు, బూతు డైలాగులు ఎక్కువ ఉన్నాయంట.దాంతో కట్ చెప్పుకుంటూపోయారు‌.

అక్కడితో ఆగకుండా ఆ సినిమా నిర్మాతని అవమానించారట సెన్సార్ సభ్యులు.ఈ సినిమాకి నిర్మాత ఓ మహిళ కావడంతో, ఒక స్త్రీ ఇలాంటి ఎలా నిర్మిస్తుంది? అసలు ఆడదానివేనా నువ్వు ? ఇలాంటి సినిమా తీసావ్ అంటూ విమర్శించారట సెన్సార్ సభ్యులు.దాంతో కోర్టుకి వెళ్ళారు ఈ సినిమా మేకర్స్.

ఈ వివాదంపై విరుచుకుపడింది ఆ సినిమా హీరోయిన్ బిదితా బాగ్."భారతదేశంలో ఎవరు బూతులు మాట్లాడట్లేదు.

Advertisement

అసలు భారతీయ మగవారికి శృంగారం మీద ఆసక్తి లేదు.ఇండియాలో ఎవరు శృంగారం చేసుకోవట్లేదు.

ఇలానే ఉంది సెన్సార్ బోర్డు తీరు.బయట జరగని విషయాలను చూపెట్టడం లేదు కదా.అయినా సినిమాలో ఎలా తీయాలో సెన్సార్ వారు చెప్పటం ఏమిటి ? ఆడదానివి ఈ సినిమా ఎలా తీసావ్ అన్నారట.ఆడవారు ఎలా ఉండాలో చెప్పేయండి.

సర్టిఫికెట్ ఇవ్వడం వరకే సెన్సార్ పని" అంటూ గట్టిగా రెస్పాండ్ అయ్యింది.నవాజొద్దిన్ సిద్దిఖి నటించిన ఈ సినిమాకి పబ్లిసిటీ అయితే బాగా దొరుకుతోంది కాని ఈ సినిమా కట్స్ నుంచి తప్పించుకోని విడుదల అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

నార్మల్ డెలివరీ తరువాత తల్లి కోలుకోవడానికి 10 జాగ్రత్తలు
Advertisement

తాజా వార్తలు