గేమ్ చేంజర్ గురించి నన్ను అడగద్దు... నాకేం తెలియదు: దిల్ రాజు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ramcharan ) హీరోగా శంకర్( Shankar ) డైరెక్షన్ లో వస్తున్నటువంటి తాజా చిత్రం గేమ్ చేంజర్(Game Changer) .పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

 Dont Ask Me About The Game Changer I Dont Know Dil Raju, Ramcharan, Shankar, Dil-TeluguStop.com

ఇక ఈ సినిమాని వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.అయితే ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతి ఈ సినిమా రావడం కష్టమేనని తెలుస్తోంది.

శంకర్ ఈ సినిమాకు కమిట్ అయిన తర్వాత గతంలో వాయిదా పడినటువంటి ఇండియన్ 2( Indian 2)సినిమా షూటింగ్ కి అనుమతులు లభించాయి.

Telugu Dil Raju, Game Changer, Indian, Ramcharan, Shankar-Movie

ఈ విధంగా భారతీయుడు 2,గేమ్ చేంజర్ రెండు సినిమా షూటింగులు ఒకేసారి జరగడంతో శంకర్ కొద్ది రోజులు ఒక సినిమాకు మరి కొద్ది రోజులు మరొక సినిమాకు సమయం కేటాయిస్తున్నారు.దీంతో ఈ సినిమాల షూటింగ్ పనులు ఆలస్యం అవుతూ వస్తున్నాయి.అయితే ఈ సినిమా కూడా రామ్ చరణ్ కూతురు పుట్టడంతో కొంతకాలం పాటు షూటింగుకు బ్రేక్ ఇచ్చారు.

ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయకపోవడంతో అభిమానులు కూడా దర్శక నిర్మాతలపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Dil Raju, Game Changer, Indian, Ramcharan, Shankar-Movie

ఇలా ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా వేదికగా భారీగా దర్శక నిర్మాతలను( Director Producers ) ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు రామ్ చరణ్ సినిమా గురించి అప్డేట్ కావాలి అంటూ గట్టిగా కేకలు వేశారు.దీంతో దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా గురించి ఎవరు నన్ను అడగవద్దు.

ఈ సినిమా గురించి నాకేం తెలియదు.ఈ సినిమా అప్డేట్స్ నా చేతుల్లో లేవు అంతా డైరెక్టర్ చేతిలోనే ఉంది అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube