భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామికి( Vivek Ramaswamy ) డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) షాకిచ్చారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రామస్వామిని తన రన్నింగ్ మేట్ లిస్ట్( Running Mate List ) నుంచి తొలగించారు.
ఒకదశలో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం రామస్వామి పోటీపడ్డారు.అయితే తనకు అనుకున్న స్థాయిలో మద్ధతు లభించకపోవడంతో మధ్యలోనే రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
రన్నింగ్ మేట్‌గా తొలగించినప్పటికీ.ఆయనకు కేబినెట్ పదవిని ఆఫర్ చేసే యోచనలో ట్రంప్ వున్నట్లుగా బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ట్రంప్ సన్నిహితులు .రామస్వామిని సరైన ఎంపికగా పేర్కొన్నప్పటికీ ఉపాధ్యక్ష పదవికి వివేక్‌ను ఎంపిక చేయడం లేదని మాజీ అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఆయనకు తెలియజేశారు.మీడియాలో వస్తున్న కథనాలను బట్టి రామస్వామిని కీలకమైన హోంలాండ్ సెక్యూరిటి విభాగానికి సెక్రటరీగా( Homeland Security Secretary ) నియమించాలని ట్రంప్ భావిస్తున్నారట.బలమైన పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను కలిగి వున్నందున , కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలపై వచ్చే విమర్శలను రామస్వామి తిప్పికొడతారని ట్రంప్ యోచిస్తున్నారు.
నార్త్ డకోటా గవర్నర్ డౌగ్ బర్గమ్, యూఎస్ మాజీ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ థైజర్, ఎలిస్ స్టెఫానిక్లతో సహా పలువురు నాయకులు కేబినెట్ పదవులు పొందే లిస్టులో వున్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ అధ్యక్షుడైతే ఉపాధ్యక్షుడు ఎవరు అన్న దానిపై అమెరికాలో చర్చ జరుగుతోంది.మహిళా అభ్యర్ధిని ఎంపిక చేస్తే ప్రయోజనం వుంటుందని భావించడం వల్లే రామస్వామిపై కొందరు విముఖత చూపారని కథనాలు వస్తున్నాయి.కానీ మహిళా ఉపాధ్యక్ష అభ్యర్ధి వుండటం వల్ల ఎలాంటి ప్రభావం వుండదని చరిత్ర చెబుతోంది.
న్యూయార్క్ రిపబ్లికన్ ఎలిస్ స్టెఫానిక్,( Elise Stefanik ) అర్కాన్సాస్ గవర్నర్ సారా హకబీ శాండర్స్,( Sarah Huckabee Sanders ) డెమోక్రటిక్ పార్టీ మాజీ ప్రతినిధి తులసీ గబ్బార్డ్, ఫైర్‌బ్రాండ్ రిపబ్లికన్ కారీ లేక్ , సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టి నోయెమ్లను ట్రంప్ తన రన్నింగ్ మేట్ కోసం పరిగణించవచ్చు.

రామస్వామి.జనవరిలో అయోవా కాకస్‌లలో( Iowa Caucus ) నాల్గవ స్థానంలో నిలిచి రేసు నుంచి తప్పుకున్నారు.అధ్యక్ష నామినేషన్‌ను పొందడంలో విఫలమైనప్పటికీ ట్రంప్ మద్ధతును, ప్రచార ర్యాలీలలో ప్రజల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నారు.







