అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) భద్రతపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం పెన్సిల్వేనియా( Pennsylvania )లో జరిగిన సభలో తృటిలో హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు ట్రంప్.
ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.ఆ వెంటనే ట్రంప్‌ను చంపేస్తానంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ భద్రతను సీక్రెట్ సర్వీస్ కట్టుదిట్టం చేసింది.అయినప్పటికీ మరోసారి ట్రంప్ రెప్పపాటులో బయపట్టారు.
ఫ్లోరిడా( Florida )లోని పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా.ఓ అగంతకుడు తుపాకీతో లోపలికి ప్రవేశించాడు.అతనిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమై కాల్పులు జరిపారు.దీంతో అగంతకుడు కారులో పారిపోయేందుకు యత్నించగా.పోలీసులు ఛేజ్ చేసి అతనిని పట్టుకున్నారు.నిందితుడిని ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.
ట్రంప్‌ను చంపాలనే లక్ష్యంతో నిందితుడు దాదాపు 12 గంటలపాటు రెక్కీ నిర్వహించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.అతనిపై పలు అభియోగాలు మోపిన దర్యాప్తు అధికారులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు.
ట్రంప్‌ను హత్య చేసేందుకే నిందితుడు వచ్చినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్ధారించింది.
ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించారు.జో బైడెన్, కమలా హారిస్‌లు( joe Biden, Kamala Harris ) తనపై రెచ్చగొట్టే పదజాలం వాడటం వల్లే నిందితుడు తనను చంపాలని అనుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.బైడెన్, హారిస్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే ముప్పని, తానూ అలాంటి మాటలు మాట్లాడగలనని ట్రంప్ హెచ్చరించారు.
కొన్ని మీడియా సంస్థలు సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.ఇటీవల జరిగిన సెకండ్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌ను ఉద్దేశించే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ చర్చా కార్యక్రమంలో హోస్ట్‌లు డెమొక్రాట్లకే అండగా నిలిచారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.మరి మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై బైడెన్, కమలా హారిస్ ఎలా కౌంటరిస్తారో వేచి చూడాలి.