ఇండియన్ రైల్వే దినదినాభివృద్ధి చెందుతూ వుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.ప్రయాణికుల అభిరుచుల మేరకు ఇండియన్ రైల్వే రకరకాల నిర్ణయాలను తీసుకుంటూ దూసుకుపోతోంది.
ఇప్పటికే వందే భారత్ వంటి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణికుల ప్రయాణాన్ని తేలిక చేసిన ఇండియన్ రైల్వే పాత రైళ్లలో కూడా మరిన్ని సదుపాయాలను తెచ్చి పెడుతోంది.ఈ క్రమంలోనే తాజాగా రైళ్లలో ప్రయాణిస్తున్న వారు వాట్సాప్ ద్వారా ఫుడ్‌ను ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా పిజ్జాను కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.ఇందులో భాగంగానే IRCTC ఈ-క్యాటరింగ్‌తో ప్రముఖ ఫుడ్ చెయిన్ సంస్థ అయినటువంటి డొమినాస్ తో జతకట్టింది.దీంతో రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన పిజ్జాను ఆర్డర్ చేసుకుంటే నేరుగా మీ వద్దకు పిజ్జా డెలివరి అవుతుంది.IRCTC ఈ-క్యాటరింగ్ యాప్ అయిన ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ ద్వారా వెజ్, నాన్ వెజ్ పిజ్జాలను ఇపుడు ప్రయాణికులు ఆర్డర్ చేసుకోవచ్చు.

దానికోసం మొదటగా ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ముందుగా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.ఆ తరువాత మీ PNR నెంబర్‌ను ఎంటర్ చేయాలి.ఇపుడు మీరు ఏ స్టేషన్‌లో పిజ్జాను తీసుకోవాలనుకుంటున్నారో స్టేషన్ పేరును ఎంటర్ చేయాలి.అనంతరం డొమినాస్ నుంచి మీకు నచ్చిన పిజ్జాను కార్ట్‌లోకి యాడ్ చేసుకోవాలి.తరువాత పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తే మీరు కూర్చున్న చోటుకు పిజ్జాను తెచ్చిస్తారు.అంతేకాకుండా మీరు డొమినాస్ యాప్ ద్వారా డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు కూడా.
ఇక ఆ ప్రాసెస్ అందరికీ తెలిసిందే.అయితే ఇక్కడ రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా డొమినాస్ యాప్‌ను ఓపెన్ చేసిన తరువాత ‘డెలివర్ ఆన్ ట్రైన్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.







