ప్రపంచంలోనే ఏదైనా విశ్వాసం ఉన్న జీవి అంటే అది ఒక కుక్కని ఇట్లే చెప్పచ్చు.ప్రపంచంలో కుక్కకు( Dog ) మించిన విశ్వాసి మరొకటి లేదు.
కాస్త కుక్కకు అన్నం పెట్టి ఆదరిస్తే చాలు.అలాంటివారి కోసం కుక్కలు ఎంతటి రిస్క్ అయినా సరే చేసి వారిని కాపాడుకోవడం అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.
అందుకే కాబోలు మనుషులకి, కుక్కలకి మధ్య స్నేహభావం కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు.ఇందుకు సంబంధించి అనేకసార్లు కుక్కలు చేసిన సంఘటనలు ఎన్నో.
ఇటువంటి సంఘటన మరొకటి తాజాగా చోటుచేసుకుంది.అపాయంలో ఉన్న తన యజమాని( Owner ) ప్రాణాలు పోకుండా కాపాడింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.ఓ నిర్మాణంలో ఉన్న ఇంటి నిర్మాణం వద్ద ఒక స్విమ్మింగ్ పూల్( Swimming Pool ) ఉంది.అయితే స్విమ్మింగ్ పూల్ కట్టపై ఇద్దరు వ్యక్తులు ఏదో విషయంపై గొడవ పడిన తర్వాత అనంతరం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నీళ్లల్లో తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అలా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నీళ్లలో పడిన వ్యక్తి కాళ్లు, చేతులు ఆడిస్తూ మునిగిపోతున్నట్లుగా వీడియోలో కనపడుతుంది.అయితే ఈ విషయం మొత్తం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై ఉన్న ఓ కుక్క గమనిస్తూనే ఉంటుంది.

అయితే నీళ్లలో మునిగిపోకుండా వ్యక్తిని కాపాడేందుకు కుక్క పరుగు పరుగున స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకొని నీళ్లలో అమాంతం దూకేస్తుంది.అలా దూకేసిన కుక్క ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా అతన్ని పట్టుకొని స్విమ్మింగ్ పూల్ గట్టుకు చేరుస్తుంది.ఇకపోతే ఈ సన్నివేశం మొత్తం అక్కడ ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో చూసినట్లయితే.
ఇది కుక్కకు ట్రైనింగ్ ఇచ్చి టెస్ట్ చేసే విధంగా ఉంది కాబోలు.







