ఫేవరెట్ సాంగ్ వినగానే ఈ కుక్క ఎలా రియాక్ట్ అయిందో చూస్తే ఆశ్చర్యపోతారంతే..

కుక్కలు మానవులతో పోలిస్తే మరింత చురుకైనా సెన్సెస్ కలిగి ఉంటాయి.చాలా దూరం నుంచి వస్తున్న వాసనలను కూడా ఇవి పసిగట్టగలవు.

 Dog Reaction Hearing Kabir Singh Dil Ka Dariya Song Video Viral Details, Dog’s-TeluguStop.com

అంతేకాదు, శబ్దాలను కూడా మనుషుల కంటే ఎక్కువ స్పష్టంగా వినగలవు.కొన్ని శబ్దాలను బాగా గుర్తించుకుని వాటికి అనుగుణంగా కూడా ప్రవర్తించగలవు.

ఉదాహరణకి కుక్కకి( Dog ) ఏదైనా పేరు పెడితే ఆ పేరుతో పిలిచినప్పుడు అది వెంటనే పలుకుతుంది.

అలాగే మొబైల్, టీవీలో వినిపించే శబ్దాలకు కూడా ఇవి రియాక్ట్ అవుతుంటాయి.

కొన్ని సినిమాలు చూస్తూ వాటిలో లీనం అయిపోతాయి.వినోదాన్ని ఎంజాయ్ చేసే ఈ తరహా కుక్కలకు సంబంధించి ఎన్నో వీడియోలు వైరల్ అయి ముచ్చట గొల్పించాయి.

అలాంటి మరో వీడియో ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది.అరిజిత్ సింగ్ పాడిన “కబీర్ సింగ్”( Kabir Singh ) సినిమాలోని “తుజే కిత్నా చాహ్నే లగే/ దిల్ కా దరియా” పాటకు ఆ కుక్క రియాక్ట్ కావడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.

టీవీలో ప్లే అయ్యే ఇతర పాటలకు సదరు కుక్క రియాక్ట్ అవలేదు.కానీ కబీర్ సింగ్ లోని పాట వినిపించగానే వెంటనే అది రియాక్ట్ అవుతూ అరుస్తూ ఆశ్చర్య పరిచే విధంగా ప్రవర్తించింది.

ఈ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఓపెన్ చేస్తే మనకు సోఫాలో పడుకున్న కుక్క కనిపిస్తుంది.అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో టీవీలో వివిధ పాటల ప్లే అవుతుంటాయి.అయితే, “తుజే కిత్నా చాహ్నే లగే”( Tujhe Kitna Chahne Lage ) ప్రారంభమైన వెంటనే, కుక్క లేచి, నిలబడి, పాటకు అనుగుణంగా పాడినట్లు కనిపిస్తుంది.

“తుజే కిత్నా చాహ్నే లగే” అసలైన మ్యూజిక్ వీడియోలో షాహిద్ కపూర్( Shahid Kapoor ) నటించారు.ఈ కుక్క వీడియో షేర్ చేసిన సమయం నుంచి చాలా వ్యూస్ పొందింది.నెటిజన్లు ఈ వీడియో పై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు బహుశా ఈ పాట విని ఈ కుక్క తన బ్రేకప్ గుర్తు తెచ్చుకుందేమో అని మరి కొందరు సరదాగా వ్యాఖ్యానించారు.

మొత్తం మీద ఈ కుక్క పాట వినగానే మనిషిలాగా రియాక్ట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube