ఓ కుక్క గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది... విషయమిదే!

ఈ ప్రపంచంలో ఒకే ఒక్క జీవిని మనిషి విశ్వాసం కలిగిన జంతువుగా పరిగణిస్తారు.అదే శునకం.

 Dog Creates Guinness World Record With Longest Tongue Details, Dog, Viral Lates-TeluguStop.com

అందుకే మరే జంతువు గురించి పెద్దగా పట్టించుకోని వ్యక్తి కుక్కను గురించి పట్టించుకుంటాడు.అంతేకాదు, తన ఇంట్లో కూడా దానికి స్థానాన్ని కల్పిస్తాడు.

యజమానుల పట్ల అత్యంత విశ్వాసంతో మెలిగే కుక్కలు, ఒక్కసారి మనకి అలవాటు పడ్డాయంటే జీవితాంతం విడిచిపెట్టి ఉండలేవు.అందుకే చాలామంది ప్రజలు తమకు తోడుగా ఉంటుందని కుక్కలను తమ ఇళ్లల్లో పెంచుకుంటుంటారు.

అయితే కుక్కల్లో కూడా అనేక జాతులు ఉన్నాయి.జాతులను బట్టి వాటి ఆకారాలు కూడా వేరుగా ఉంటాయి.

ఇక విషయానికొస్తే, పెంపుడు కుక్కల్లో అతిపెద్ద నాలుక కలిగిన కుక్కగా అమెరికాకు చెందిన బిస్బి అనే కుక్క ఏకంగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.మూడేళ్ల వయసున్న బిస్బి నాలుక 3.74 అంగుళాల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక కలిగిన కుక్కగా రికార్డులు నెలకొల్పింది.ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ మేరకు ఈ కుక్క వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ట్విటర్ ఖాతాలో అధికారికంగా షేర్ చేశారు.

అవును, అమెరికాలోని టక్సన్‌ నగరానికి చెందిన ఈ కుక్క అత్యంత పొడవైన నాలుక కలిగి ఉండటంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించింది.బిస్బీ అనే 3 సంవత్సరాల కుక్క 3.74 అంగుళాల నాలుకను కలిగి ఉంది.మూతి కొన నుండి కుక్క నాలుకను కొలవటం ద్వారా ప్రపంచ రికార్డు క్రియేట్‌ చేసినట్టుగా చెప్పుకొచ్చారు.కుక్క యజమానులు అయినటువంటి జే, ఎరికా జాన్సన్.వారు కుక్కపిల్లని దత్తత తీసుకున్నప్పుడు కొంచెం భిన్నమైన విషయాన్ని గమనించారు.కొన్ని రోజుల తర్వాత, కుక్క నాలుక మరింత పొడవుగా పెరిగిపోవటం గమనించారు.

విషయం అతని స్నేహితులకు చెప్పారు.దానిని ఫోటో తీసి పంపగా, వారిలో కొందరు కుక్క నాలుక ప్రపంచ రికార్డు కావచ్చని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube