ఫోన్ లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..ఫోన్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చేయండి..!

ప్రస్తుతం మొబైల్ ఫోన్ ( Mobile phone )ఉపయోగించని వ్యక్తులు బహుశా ఉండరేమో.ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషి చేతిలో మొబైల్ ఫోన్ తిరుగుతూనే ఉంటుంది.

 Does The Phone Charge Quickly Change This Small Setting On The Phone , Mobile Ph-TeluguStop.com

అయితే మొబైల్ ఫోన్ ఉపయోగించిన కాసేపటికి ఫోన్లో త్వరగా చార్జింగ్ ( charging )అయిపోతూ ఉండడం ఒక ప్రధాన సమస్యగా మారింది.కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాక ఫుల్ ఛార్జ్ చేస్తే మొదట్లో రెండు లేదా మూడు రోజులు ఫోన్లు బ్యాటరీ బ్యాకప్ ( Phones battery backup )ఇస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్ పాత పడే కొద్ది ఫుల్ ఛార్జ్ చేస్తే కొన్ని గంటలకే ఫోన్ లో ఛార్జింగ్ తర్వాత అయిపోతుంది.

Telugu Phone, Battery Backup, Smart Fast Mode-Technology Telugu

ఈ సమస్యను అధిగమించడానికి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొన్ని నియమాలను సూచించాయి.ఫోన్ లో త్వరగా బ్యాటరీ అయిపోతే ఏం చేయాలో అనే విషయాలు తెలుసుకుందాం.ఏ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ పెట్టిన 100% పూర్తికాకుండానే అంటే 90% చార్జింగ్ పూర్తి అయితే ఫోన్ చార్జింగ్ తీసేయాలి.

ఫోన్ ను చార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తే బ్యాటరీ తన సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతూ వస్తుంది.అలాగే కంపెనీ ఛార్జర్ మాత్రమే ఉపయోగించాలి.అంతేకాకుండా ఒకవైపు ఫోన్ చార్జింగ్ లో పెట్టి మరొకవైపు ఫోన్ ఉపయోగించడం కూడా ప్రమాదకరమే.ఫోన్లో చార్జింగ్ పూర్తిగా అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు.

Telugu Phone, Battery Backup, Smart Fast Mode-Technology Telugu

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్( Smart phones fast charging mode ) లో ఉంటే.ఫోన్ త్వరగా వేడిని గ్రహిస్తుంది.దీంతో బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది.ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ లో కనిపించే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ను నిలిపివేయాలి.అయితే ఈ ఆప్షన్ నిలిపివేయడం వల్ల ఫోన్ చార్జింగ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.స్మార్ట్ ఫోన్లో ఉపయోగించని యాప్స్ స్లీప్ మోడ్ లో ఉంటే చార్జింగ్ త్వరగా అయిపోదు.

అందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ ను క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే అక్కడ బ్యాక్ గ్రౌండ్ యూసేజ్ లిమిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.అప్పుడు ఉపయోగించని యాప్స్ ను స్లిప్ మోడ్ లోకి వెళ్తాయి.

ఈ టిప్స్ పాటిస్తే ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube