భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రజనీకాంత్ ( Rajinikanth )73 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల హీరో లాగా తన మేనరిజంతో అందరినీ ఆకట్టుకుంటాడు.తాజాగా విడుదలైన జైలర్( Jailer ) సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన యాక్టింగ్ స్టైల్ ఏంటో నిరూపించుకొని అభిమానులను అలరించాడు.
ఇక రజనీకాంత్ సినిమా చూడడానికి కొంతమంది అభిమానులు అయితే వేరే దేశాల నుండి కూడా వచ్చి థియేటర్స్ లో హంగామా చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే అలాంటి రజనీకాంత్ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఇప్పుడు తెలుసుకుందాం.
అదేంటంటే రజనీకాంత్ 73 ఏళ్ల వయసులో కూడా అంత యంగ్ గా యాక్టివ్ గా సినిమాల్లో చేయడానికి ప్రధాన కారణం అదే అంటూ ఆయన స్నేహితుడు రాజ్ బహదూర్ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు.రాజ్ బహదూర్( Raj Bahadur ) మాట్లాడుతూ.రజనీకాంత్ ప్రతిసారి హిమాలయాలకు వెళ్తూ ఉంటారు.అక్కడికి వెళ్లి సన్యాసులు, సాధువులు ఇచ్చే అనేక రకాల వేర్లను తాయత్తులుగా కట్టుకుంటారు.అంతేకాకుండా వాళ్లు ఔషధ మూలికలకు సంబంధించిన మెడికల్ టాబ్లెట్స్ వేసుకుంటారు.ఇక టాబ్లెట్ ఒక్కటి వేసుకుంటే వారం రోజుల వరకు రజనీకాంత్ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తారు.
అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన ప్రతిసారి పూజలు,హోమాలు వంటివి చేస్తారు.అందుకే రజనీకాంత్ ప్రతిసారి హిమాలయాలకు వెళ్తూ ఉంటాడు.
కానీ గత నాలుగు సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెళ్లలేక పోయారు అంటూ రజనీకాంత్ ఆరోగ్య రహస్యాన్ని తన స్నేహితుడు రాజ్ బహదూర్ బయటపెట్టారు.ఇక ఈ మధ్యకాలంలో రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి హిమాలయాలకు వెళ్లిన ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.