కరోనాని ఖతం చేస్తున్న 'చూయింగ్ గమ్‌'.. శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం?

ప్రపంచం కరోనాకు ముందు, తరువాత అన్నమాదిరి తయారైంది జీవితం.అవును.

 Doctors Testing Experimental Chewing Gum To Treat Corona Virus Details, Carona,-TeluguStop.com

కరోనా రక్కసి ప్రపంచాన్ని కాటువేసిన తరువాత అనేక ఎత్తుపల్లాలను చూశాం.ప్రస్తుతం కరోనా తగ్గినప్పటికీ వందశాతం మాత్రం కంట్రోల్ కాలేదనే చెప్పుకోవాలి.

ఈ క్రమంలో అనేకమంది ఇప్పటికీ వైర‌స్‌కు సంబంధించిన ఔషదాలు కనిపెడుతూనే వున్నారు.ఇలాంటి ప‌రిస్థితిలో నిపుణుల స‌మీక్ష‌లో స‌క్సెస్ అయ్యి, ఇంకా ధృవీకరించబడని ఒక కొత్త ప‌రిశోధ‌నా అధ్యయనం కోవిడ్ వ్యాప్తిని నియంత్రించే అంశాన్ని తెలియ‌జేసింది.

ఇందులో, ప్రయోగాత్మక చూయింగ్ గమ్ గురించి పేర్కోవడం విశేషం.ఈ చూయింగ్ ముక్క లాలాజలంలో ఓమిక్రాన్ కణాలను తగ్గించగలదని చెబుతున్నారు.ఈ అధ్యయనం ప్రకారం, ఈ గమ్ లాలాజలంలో SARS-CoV-2 కణాలను “ట్రాప్ చేస్తుంది.” అలాగే, వైరస్‌కు సంబంధించి వ్యాప్తిని అరికట్టడంలో పూర్తిగా సహకరిస్తుంది.దీని వ‌ల్ల వైరస్ కణాలు చూయింగ్ గమ్‌లోని ACE2 “రిసెప్టర్లకు” తమను తాము అటాచ్ చేసుకుంటాయి.దీనితో, వైరల్ లోడ్ గుర్తించలేని స్థాయికి పడిపోతుంద‌ని పరిశోధకులు బయోమెటీరియల్స్‌లో చెప్పుకొచ్చారు.

Telugu Ace Gum, Carona, Gam, Doctors, Gum, Scientific, Treat Corona, Latest-Late

డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌లు సోకిన వ్యక్తుల నుండి లాలాజలాన్ని ఉపయోగించి టెస్ట్-ట్యూబ్ ప్రయోగాలు చేసిన‌ప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చాయి.పరిశోధకులు మొదట మానవ ట్రయల్‌ని ప్రారంభించడానికి ముందు, COVID-19 రోగులు క్లినికల్ ట్రయల్‌లో ప్రతి రోజు 4 రోజుల పాటు నాలుగు ACE2 గమ్ టాబ్లెట్‌లను న‌మిలారు.ఈ సందర్భంగా పరిశోధన ప్ర‌ధాన ర‌చ‌యిత‌, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ డెంటల్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ హెన్రీ డేనియల్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, “నోటితో పోల్చినప్పుడు నాసికా ప్రసారంతో వ్యాప్తి చాలా తక్కువ కాబట్టి… ACE2 గమ్ నమలడం, ACE2 ప్రోటీన్ మింగడం వ్యాప్తిని నిరోధించవచ్చు!” అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube