సాధారణంగా ఫారిన్ దేశాల్లో ప్రజలు వివిధ రకాల జంతువులను తినేస్తుంటారు.ముఖ్యంగా సీ ఫుడ్‌లో( Sea Food ) ఎన్నో వెరైటీలను ట్రై చేస్తుంటారు.
అయితే ఇటీవల సింగపూర్‌కు( Singapore ) చెందిన ఓ వ్యక్తి ఆక్టోపస్ ని( Octopus ) ఆబగా తినేసాడు.దురదృష్టవశాత్తు, ఆక్టోపస్ అతని గొంతులో ఇరుక్కుపోయింది.
దాంతో అతడు ఆ జలచర మాంసాన్ని మింగలేక కక్కలేక చాలా ఇబ్బంది పడ్డాడు.వాంతులు చేసుకుని డీహైడ్రేషన్‌కు గురయ్యాడు.
కొంతసేపటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది.ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతని పరిస్థితిని చూసి షాక్ అయ్యారు.

వైద్యులు అతని గొంతును పరిశీలించడానికి స్కాన్‌ను ఉపయోగించారు.ఆ ఆక్టోపస్ సదరు వ్యక్తి గొంతు కడుపులో కలిసే ప్రదేశానికి కేవలం 5 సెంటీమీటర్ల దూరంలో ఇరుక్కుపోయిందని కనుగొన్నారు.వారు దానిని తొలగించడానికి ప్రయత్నించారు, కానీ మొదట విజయవంతం కాలేదు.చివరగా, వారు ప్రత్యేక సాధనాలను ఉపయోగించి ఆక్టోపస్ తలని బయటకు తీయగలిగారు.

తర్వాత సదరు వ్యక్తి ఆరోగ్యం కుదుటపడింది.కేవలం రెండు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.అయితే అతడు గురించి తెలుసుకున్న నెటిజన్లు “అంత కక్కుర్తి ఎందుకు? చిన్నపాటి ముక్కలు తినొచ్చుగా” అని కామెంట్లో చేస్తున్నారు.ఇలా గొంతులో అడ్డంకులు ఏర్పడడం సర్వసాధారణమని, వాటిని తొలగించేందుకు సాధారణంగా ‘పుష్ టెక్నిక్’ ( Push Technique ) అనే టెక్నిక్‌ను ఉపయోగిస్తామని వైద్యులు తెలిపారు.ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు.2016లో, కాన్సాస్‌కు చెందిన 2 ఏళ్ల బాలుడు కూడా అతని గొంతులో ఆక్టోపస్ ఇరుక్కుపోయినందున ఆసుపత్రిలో చేరాడు.








