కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు రెడీ అవుతున్న డాక్టర్లు..!!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేయవద్దంటూ నోటిఫికేషన్ రిలీజ్ చేయటంతో దానికి వ్యతిరేకంగా భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్రం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ కి వ్యతిరేకంగా ఫిబ్రవరి మొదటి తారీకు నుంచి దేశ వ్యాప్తంగా డాక్టర్లందరూ సామూహిక నిరాహార దీక్షకు దిగడానికి రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో ముందుగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ ద్వారా తెలియజేస్తామని ఐఎంఏ స్పష్టం చేసింది.అంతేకాకుండా దేశవ్యాప్తంగా సేవ్ హెల్త్కేర్ మూమెంట్ ను ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు కూడా తెలిపింది.

Doctors-ready-to-worry-against The Center Ima-doctors-farmers-save Health Care-c

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ ప్రజల ఆరోగ్యానికి ఉన్న ప్రమాదాన్ని వివరించాలని అనుకుంటున్నట్లు తెలిసింది.సేవ్ హెల్త్కేర్ మూమెంట్ అనే నినాదంతో ఫిబ్రవరి మొదటి తేదీ నుండి దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరాహారదీక్షలు కూర్చుంటారని స్పష్టం చేసింది.త్వరలోనే ఈ ఉద్యమానికి సంబంధించి పోస్టర్లు మరియు బ్యానర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) కీలక ప్రకటన చేసింది.

కాగా ప్రస్తుతం రైతులు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ విషయంలో కేంద్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది.

Advertisement
Doctors-ready-to-worry-against The Center Ima-doctors-farmers-save Health Care-c

ఇలాంటి తరుణంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు కూడా రోడ్డు పైకి రావటం అనేది మరింతగా కేంద్రాన్ని ఇరుకున పెట్టే అంశం అని చెప్పవచ్చు. .

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు