Allu Arjun : స్టార్ హీరో అల్లు అర్జున్ బాలీవుడ్ ఫేవరెట్ హీరో అతనేనా.. ఆ హీరో అంటే అంత అభిమానమా?

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu arjun ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

 Do You Who Is Alluarjuns Bollywood Favourite Hero-TeluguStop.com

కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే విడుదలైన పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ.

ఈ సినిమా ఈసారి అంతకుమించి అనే విధంగా పుష్ప 2( Pushpa 2 ) ఉండబోతుందని తెలుస్తోంది.ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే.

పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కు హిందీ ఆడియెన్స్ లో చాలా ఫాలోయింగ్ పెరిగింది.వీరాభిమానులు ఏర్పడ్డారు.ఇదిలా ఉంటే బాలీవుడ్ లో అల్లు అర్జున్ ఎంతగానో ఇష్టపడే హీరో గురించి తెలిసింది.అల్లు అర్జున్ కు బాగా నచ్చిన బాలీవుడ్ హీరో మరెవరో కాదు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) ఆయన సినిమాలంటే బన్నీకి చాలా ఇష్టమంట.అందులో ముఖ్యంగా జంజీర్ మూవీ తన ఫేవరెట్ అని చెప్పారు.

హిందీ ఆడియెన్స్ బన్నీని ఇష్టపడుతున్న తరుణంలో బిగ్ బీ తన ఫేవరెట్ హీరో అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ విషయాన్ని బన్నీ అలవైకుంఠపురం చిత్రం సమయంలోనే చెప్పారు.ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 కోసం పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఒక్క అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పవచ్చు.

ముఖ్యంగా పుష్ప పార్ట్ 2 నుంచి విడుదలైన అర్ధనారీశ్వరుడు గెటప్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube