దీపావళి పండుగకు అందంగా కనిపించాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

మన దేశంలో పండుగ సమయాలలో ప్రతి ఒక్కరూ అందంగా తయారవ్వాలని అనుకుంటుంటారు.అందుకోసం చర్మ సంరక్షణలో కూడా ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.

పండుగ రోజులలో అందంగా కనిపిండానికి ఎలాంటి ఆహారాలు ఉపయోగపడతాయో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే చర్మం ఆరోగ్యంగా ఉంటేనే ఎవ్వరైనా గాను అందంగా కనిపిస్తారు.

అయితే నలుగురిలో తామే అందంగా, కాంతివంతంగా కనిపించాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు.దాని కోసం మీ చర్మాన్ని,మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

కేవలం కొన్ని కొన్ని ఆహారాలను తింటే మీ చర్మంతో పాటుగా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.కుంకుమ పువ్వు చర్మ సౌందర్యం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Advertisement

అలాగే కుంకుమపువ్వులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.దీన్ని సహజంగా గర్భిణులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

ఎందుకంటే దీన్ని పాలలో వేసుకుని తాగితే బిడ్డ తెల్లగా పుడతాడని,అందుకే దాన్ని ఎక్కువగా తాగుతూ ఉంటారు.కుంకుమ పువ్వులో ఉండే ఔషదగుణాలు తల్లితో పాటుగా బిడ్డను కూడా ఆరోగ్యంగా ఉంటారు.

ముఖ్యంగా ఇవి మీ చర్మానికి సహజ మెరుపును ఇవ్వడంలో సహాయపడతాయి.కుంకుమపువ్వును నీటిలో నానబెబ్టి తాగడం చర్మానికి చాలా మంచిది.

అయితే ఈ కుంకుమ పువ్వును ఎక్కువగా తినడం కూడా అంత మంచిది కాదు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి తో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.ఈ ఉసిరికాయ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఉసిరి రసం తరచుగా తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు జుట్టు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.

Advertisement

విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రిస్ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.ఈపండ్లు తినడం వల్ల చర్మం పొడిబారడం, నల్లటి మచ్చలను దూరం చేస్తాయి.

తాజా వార్తలు