మన చిన్నతనంలో రోజు చుసిన ఈ జెమినీ యాంకర్స్ మీకు గుర్తున్నారా..? ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసా..?

ఫిబ్రవరి 9, 1989 వ సంవత్సరంలో జెమినీ టీవీ ఆవిర్భావం జరిగింది.తెలుగులో శాటిలైట్ ఛానల్ ప్రారంభం అయిన రోజు అది.

అంటే ఇప్పటికీ దాదాపుగా 31 సంవత్సరాలు అయింది అంటే 3 దశాబ్దాలు పూర్తయ్యింది.ఈ సుదీర్ఘ కాలంలో జెమినీ టీవీలో ఒక వెయ్యి మంది దాకా యాంకర్స్ వచ్చి వెళ్లి ఉండేవారు కదా.వీళ్లలో మనం గుర్తు పెట్టుకునే వాళ్ళు ఒక పదిమంది దాకా మాత్రమే ఉంటారు.ఈ పదిమంది కూడా గత 20 ఏళ్లుగా తమ కెరీర్ ను కంటిన్యూ చేస్తూ ఉన్నవాళ్లే అయితే అందులో ఒక ఐదు, ఆరుగురు మాత్రమే అదే రేంజిలో ఉన్నారు.

అలాగే గత ఐదు, ఆరు సంవత్సరాల కాలంలో వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న వారు ఒక రకం.ఇంకో తరం గురించి చూస్తే వీళ్ళలో కొద్ది మంది అయితే ఏకంగా స్టార్స్ అయ్యారు కూడా. హీరోయిన్ తో సరిసమానమైన ఆదరణ పొందుతున్న వారు కూడా ఉన్నారు.

అయితే టీవీ అనేది ప్రతి ఇంటిలో 24 గంటలు చూసే ఒక సాధనంగా మారిపోవడంతో సినిమాల్లో నటించే వాళ్ళ కన్నా టివిలో నటించే యాంకర్సే వాళ్ళకి దగ్గర అయ్యారు.మొదట ఐదు సంవత్సరాలలో కేవలం జెమినీ, ఈ టీవీ మాత్రమే ఉన్నాయి.

Advertisement

ఈ టీవీ సాంప్రదాయ రీతిలో వెళితే, జెమిని మాత్రం కొంచెం క్రియేటివ్ గా ప్రేక్షకులకు చేరువయ్యింది.ఈమధ్య టీవీ లో నటించే యాంకర్స్ కి కూడా సినిమాల్లో నటించే హీరోయిన్ లెవెల్లో క్రేజ్, రెమ్యూనరేషన్లు ఉంటున్నాయి.

అంటే బుల్లితెర ప్రేక్షకులు యాంకర్స్ ను ఏ విధంగా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.అయితే అందులో కొందరు మాత్రం ప్రతి రోజు ఏదో ఒక షోలో మనల్ని పలకరిస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం అసలు కనుచూపు మేర కూడా కనిపించడం మానేసారు.

వాళ్లు ఎవరో ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఈ జాబితాలో మొదటగా మనకు గుర్తొచ్చే యాంకర్ ఎవరంటే జాహ్నవి.ఆ మధ్య జెమిని టీవిలో డాన్స్ బేబీ డాన్స్ షో వచ్చేది గుర్తు ఉందా.ఆ షో కి యాంకరింగ్ చేసిన జాహ్నవిని ఎప్పటికి మరచిపోలేము.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఈ ప్రోగ్రాం లో యాంకర్ గా తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంది.ఆ తర్వాత ఒకరికి ఒకరు, యజ్ఞం, హ్యాపీ వంటి హిట్ చిత్రాలలో హీరోయిన్ స్నేహితురాలు క్యారెక్టర్ లో కనిపించింది.

Advertisement

ఆ తరువాత ఆమె ఒకరికి ఒకరు సినిమాకు దర్శకత్వం వహించిన రసూల్ ఎల్లోర్ ని పరిణయమాడింది.అతడు కేవలం దర్శకుడు మాత్రమే కాదు.

ఊసరవెల్లి, కిక్, జల్సా, నువ్వు నేను లాంటి ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది జాహ్నవి.

వీళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు.బాబు పుట్టిన తర్వాత జాహ్నవి బాగా లావుగా అయింది.

కానీ ఇప్పుడు మాత్రం చూడటానికి చాలా స్లిమ్ గా తయారయింది.అలాగే ఒకవేళ అవకాశాలు వస్తే మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ గా ఉందని తెలుస్తుంది.

అలాగే మరొక యాంకర్ జెమినీ మ్యూజిక్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ జయతి.జెమినీ మ్యూజిక్ ఆదిత్య టీవీ గా స్టార్ట్ అయినప్పటి నుండి అందులో రాత్రి 10 గంటలకు పార్రంభం అయ్యే వెన్నెల షో కి దాదాపు ఒక 10 సంవత్సరాలు యాంకరింగ్ చేసింది జయతి.

ఇంకా ఆ షో తర్వాత జయంతి యాంకర్ గా మరే షో లో కూడా కనిపించలేదు.

అలాగే ఇంకొక యాంకర్ అనుపమ.అప్పట్లో లైవ్ షో అన్నిటిలో టాప్ షో అయిన "ఆట కావాలా.పాట కావాలా " లాంటి షో ను అద్భుతంగా హోస్ట్ చేసింది యాంకర్ అనుపమ.

అసలు ఆ షో ఎంత హిట్ అంటే ఆ రోజుల్లో సినిమా ప్రమోషన్ కోసం ఈ షో నే ఎంచుకునే వారు.ఈ షో మాత్రమే కాదు.

కొత్త సినిమా గురూ.అనే సినిమా రివ్యూ షో ను కూడా సూపర్ గా హోస్ట్ చేసింది.

మరి అంత స్టార్ యాంకర్ ఇమేజ్ ను సంపాదించుకున్న అనుపమ ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏమి చేస్తుందో తెలియదు.మరొక యాంకర్ రజినీ కూడా అంతే.

జెమినీ మ్యూజిక్ లో యాంకర్ గా పరిచయం అయిన రజినీ కొన్ని సినిమాల్లో, అలాగే సీరియల్స్ లో కూడా నటించి మంచి యాక్టర్ గా కూడా గుర్తింపు పొందింది.ప్రస్తుతం మాత్రం రజని ఎక్కడ, ఏ షో లో కూడా కనిపించడం లేదు.

అలాగే నీకోసం.అంటూ బర్త్ డే విషెస్ చెప్తూ అందరిని పలకరించే అర్చన కూడా ఈ లిస్ట్ లోకి వస్తుంది.

అలాగే ఈ షో చాలా సంవత్సరాల పాటు కొనసాగింది.ఈ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది అర్చన.

ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని బుల్లితెరకు దూరంగా ఉంటోంది.ఇప్పుడు మనం చెప్పుకున్న అందరు కూడా జెమినీ టీవీ యాంకర్స్.

అలాగే ఒక్క జెమినీ టీవీ కి మాత్రమే పరిమితం.వేరే ఏ ఛానెల్స్ లో కూడా యాంకరింగ్ చేయలేదు.

తాజా వార్తలు