సుప్రీం సినిమాలోని ఈ బుడ్డోడు గుర్తున్నాడా.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

సాయితేజ్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబినేషన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో సుప్రీం సినిమా కూడా ఒకటి.ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను మించి మెప్పించింది.

 Do You Remember Sai Dharam Tejs Supreme Movie Child Artist Mikail Gandhi What-TeluguStop.com

సుప్రీం సినిమా సక్సెస్ కు ఒక బుడ్డోడు కూడా కారణం కాగా ఆ బుడ్డోడు ఐ వాంట్ టెన్ రుపీస్ అని అడుగుతూ నవ్వించడంతో పాటు కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులను ఏడిపించారు.ఆ తర్వాత ఈ బుడ్డోడు పలు తెలుగు సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను అందుకోలేదు.

ఈ బుడ్డోడు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన లేటెస్ట్ ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ బుడ్డోడికి సోషల్ మీడియాలో తక్కువగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా మైఖేల్ గాంధీ( Michael Gandhi ) తన తల్లీదండ్రులతో దిగిన ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.రాబోయే రోజుల్లో ఈ బుడ్డోడు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

సుప్రీం ( Supreme )సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.ఏడేళ్ల వయస్సులో ఈ బుడ్డోడు సుప్రీం సినిమాలో నటించగా ప్రస్తుతం ఈ బుడ్డోడి వయస్సు 13 సంవత్సరాలు కావడం గమనార్హం.ప్రస్తుతం ఈ బుడ్డోడు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.తెలుగులో మైఖేల్ బిజీ కావాలని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మైఖేల్ గాంధీ సుప్రీంలో రాజన్ రోల్ లో కనిపించగా హలో సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు.సుప్రీం సినిమాలో ఈ బుడ్డోడితో యాక్టింగ్ చేయించుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube