షూటింగ్ తీసే సమయంలో క్లాప్ బోర్డ్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?!

మనలో చాలా మంది అనేకసార్లు సినిమా షూటింగ్ మొదలయ్యే సమయంలో హీరో లేదా హీరోయిన్ పై క్లాప్ బోర్డ్ ను కొట్టి సినిమాను ఆరంభించే పద్ధతిని మనం గమనిస్తూనే ఉంటాం.

ఈ వస్తువు చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ అసలు ఆ క్లాప్ బోర్డు ఎందుకు ఉపయోగిస్తారో అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

ఇకపోతే ఈ క్లాప్ బోర్డు ను సరిగా ఉపయోగిస్తే సినిమాపై అనవసరంగా పెట్టే లక్షల రూపాయల డబ్బులను వృధా కాకుండా అలాగే టైం వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు.అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా సులువుగా అవ్వడానికి ఈ బోర్డు ఎంతగానో ఉపయోగపడుతుంది.

వీటితో పాటు అనేక రకాల ఉపయోగాలను ఈ క్లాప్ బోర్డు కలిగి ఉంటుంది.ఇకపోతే ఈ బోర్డు పై

తేదీ, రోజు, రాత్రి, ఏ సీన్, టేక్

అలాగే ఎన్నో షాట్ నెంబర్స్ లాంటి ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి.

సినిమాకు సంబంధించిన సీన్లను ఓ క్రమపద్ధతిలో కాకుండా వారికి అనువైన పద్ధతిలో తీసుకుంటూ వెళ్తారు.అలా తీసే సమయంలో క్లబ్ బోర్డుతో క్లాప్ కొట్టి ఆ సీన్ మొదలుపెడతారు.

Advertisement

అలా క్లాప్ కొట్టే సమయంలో బోర్డు మీద రాసి ఉన్న పాయింట్స్ ఆధారంగానే ఎడిటర్ సినిమా షూటింగ్ సంబంధించిన సీన్స్ ను ఎంచుకోవడం జరుగుతుంది.ఇలా ఓ వరుస క్రమంలో అమర్చడం ద్వారా ఎడిటర్ కు చాలా పని తగ్గుతుంది.

క్లాప్ బోర్డ్ పై ఉన్న వివరాలను అనుసరించి మంచి సీన్లను ఎడిటర్ పిక్ చేసుకుని సినిమాను ముందుకు పోనిస్తారు.వీటితో పాటు ఆ క్లాప్ బోర్డ్ కొట్టినప్పుడు వచ్చే సౌండ్ ఆధారంగా కంటి విజువల్ కి కరెక్టుగా వాయిస్ ఎక్కడ సింక్ చేయాలన్న విషయంపై కూడా స్పష్టత వస్తుంది.ఇలా క్లాప్ బోర్డు ను సినీ దర్శకులు ఉపయోగిస్తారు.

Advertisement

తాజా వార్తలు