చిన్న పిల్లల తలపై భోగి పళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా..?

దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు సంక్రాంతి పండుగ( Sankranti festival ) చేసుకుంటూ ఉన్నారు.అయితే నాలుగు రోజులపాటు ఈ పండుగను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు.

అయితే నాలుగు రోజుల ఈ పండుగలో మొదటి రోజున భోగిగా నిర్వహిస్తారు.అయితే ఆరోజున తెల్లవారుజామునే లేచి, స్నానాలు చేసి, భోగి( Bhogi ) మంటలను వేసి, ఆటలు, పాటల కార్యక్రమాలను నిర్వహిస్తారు.

అంతేకాకుండా భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన రేగిపళ్ళను అంటే భోగి పళ్ళను పోస్తారు.అయితే అసలు ఇలా ఎందుకు చేస్తారు? చిన్నారుల తలపై రేగిపళ్ళను పోయడానికి అసలు కారణం ఏమిటి? అన్న సందేహం మనలో చాలామందికి వస్తుంది.

Do You Know Why Bhogi Teeth Are Put On The Head Of Small Children , Sankranti Fe

అయితే భోగి పండుగ రోజున ఉదయాన్నే లేచి భోగిమంటలు( bonfires ) వేసుకొని సంబరాలు జరుపుకుంటే మంచిది.అలాగే అదే రోజు సాయం కాలంలో చిన్నారుల తలపై వారి తల్లిదండ్రులు అలాగే ముత్తైదువులు కలిసి భోగి పండ్లను పోసి ఆశీర్వాదం ఇస్తారు.అయితే ఈ కార్యక్రమం 12 సంవత్సరాల వరకు ఉన్న చిన్నారుల తలపై ఈ పండ్లను పోస్తారు.

Advertisement
Do You Know Why Bhogi Teeth Are Put On The Head Of Small Children , Sankranti Fe

అయితే రేగి పండ్లను చిన్నారులు తలపై పోయడానికి అసలు కారణం ఏమిటంటే.రేగి పండ్లను చిన్నారుల తలపై పోయడం వలన నరదిష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

Do You Know Why Bhogi Teeth Are Put On The Head Of Small Children , Sankranti Fe

అలాగే ఇలా చేయడం వలన ఆయురారోగ్యాలతో పిల్లలు ఉంటారని పండితులు చెబుతున్నారు.అంతేకాకుండా పిల్లల తలపై రేగి పండ్లను పోయడం వలన పిల్లలకు మంచి మేధస్సు కూడా పెరుగుతుందట.అంతేకాకుండా భోగి పండ్లను గుప్పిట నిండా తీసుకొని పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు.

ఇలా పోసిన భోగి పండ్లను ఎవ్వరూ తినరు.ఇలా చేయడం పిల్లలకు మంచిదని ఈ కార్యక్రమాన్ని అనాదికాలంగా నిర్వహిస్తూ వస్తున్నారు.అంతేకాకుండా పిల్లల తెలివితేటలు పెరగడానికి కూడా ఈ విధంగా చిన్నారుల తలపై భోగి పండుగ సందర్భంగా రేగి పండ్లను భోగి పండ్లుగా చెప్పుకొని చిన్నారుల తలపై పోస్తారు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!
Advertisement

తాజా వార్తలు