తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోలు వాళ్ళ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న సమయం లో అదే ఇండస్ట్రీ లో ఉన్న శంకర్ కూడా సినిమా డైరెక్టర్ అవ్వాలని ఒక మంచి కథ రెడీ చేసుకున్నాడు.ఆయన కథ రాయడానికి ముఖ్య కారణం సేమ్ అలాంటి నిజమైన సంఘటన వాళ్ళ ఇంట్లో జరగడమే దాన్ని బేస్ చేసుకొని రాసుకున్న కథే జంటిల్ మెన్.
ఈ సినిమా కి సంభందించిన అసలు స్టోరీ ఏంటంటే వాళ్ళ తమ్ముడికి ఒక కాలేజీలో సీట్ రాలేదని సూసైడ్ చేసుకొని చనిపోయాడు అదే కథ ని తీసుకొని శంకర్ ఈ కథ ని రెడీ చేసాడు ఈ స్టోరీ ఏంటంటే చదువుని కూడా అమ్ముకుంటున్నారు అనే ఒకే ఒక పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది దింట్లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరో గా చేసాడు.

అయితే ఈ సినిమా రాజశేఖర్ తో చేద్దాం అని శంకర్ ఈ సినిమా స్టోరీ ని మొదటగా రాజశేఖర్ తో చెబితే రాజశేఖర్ తనకి డేట్స్ ఖాళీ లేవని చెప్పారట అలాగే శంకర్ కి ఇదే ఫస్ట్ సినిమా కావడం వల్ల అతను డైరెక్షన్ ఎలా చేస్తాడో అనే అనుమానాలు కూడా కలిగాయట దాంతో శంకర్ ఈ సినిమాని అర్జున్ ని హీరోగా పెట్టి తీసాడు ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించింది.ఈ సినిమాని మిస్ చేసుకున్న హీరో గా రాజశేఖర్ ఇప్పటికి బాధపడుతూ ఉంటాడు.ఈ సినిమా కనక రాజశేఖర్ చేసి ఉంటె రాజశేఖర్ కెరియర్ ఇంకోలా ఉండేదని ఇప్పటికి చాలామంది చెప్తూ ఉంటారు.

ఇక ఇది ఇలా ఉంటె ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు అలాగే రామ్ చరణ్ సినిమా కూడా 30 % షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ రెండు సినిమాలతో మళ్లి శంకర్ పూర్వ వైభవం తెచ్చుకోవాలని హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే తన గత రెండు సినిమాలు అయిన ఐ,రోబో 2.0 సినిమాలతో వరస ప్లాపులు అందుకున్న శంకర్ ఈ సినిమాతో ఇండియాలోనే బిగ్గిస్ట్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.
