బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ( Sharukh Khan, Salman Khan ) ఈ ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ.ఎవరు ఎన్ని వేల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు.
అనే సంగతి రీసెంట్ గా కరణ్ జోహార్ ( Karan Johar ) హోస్ట్ గా చేసే కాఫీ విత్ కరణ్ అనే షో లో పాల్గొన్న అజయ్ దేవగణ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.మరి అజయ్ దేవగణ్ ఎవరి ఆస్తి ఎక్కువగా ఉందని చెప్పారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అలాగే కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారుక్ ఖాన్ కి బాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువగా ఉంది అనే ప్రశ్న కరణ్ జోహార్ షోలో అజయ్ దేవగణ్ ( Ajay Devagan ) కి ఎదురైంది.అయితే ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక అజయ్ దేవగణ్ అసలు విషయాన్నీ చెప్పేశారు.అజయ్ దేవగణ్ మాట్లాడుతూ.
వీరిద్దరిలో షారుక్ ఖాన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది.అందుకే నేను ఎక్కువగా ఈయన్నే నమ్ముతాను.
ఇక షారుక్ ఖాన్ ( Sharukh khan ) ఆస్తుల పూర్తి విలువ దాదాపు 7,000 కోట్లకు పైగానే ఉంటుంది.అలాగే ఈయనకు చాలా బిజినెస్ లు కూడా ఉన్నాయి అంటూ సరదాగా చెప్పారు.ఇక కేవలం షారుక్ ఖాన్ కి మాత్రమే 7000 కోట్లకు పైగా ఆస్తి ఉంటే వారి కుటుంబ సభ్యులకు ఇంకా ఎంత ఆస్తి ఉంటుందా అని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.ఇక సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ఆస్తి విలువ 3000 కోట్లకు పైగా ఉంటుందని,అలాగే ఈయనకు చాలా రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి అంటూ అజయ్ దేవగణ్ చెప్పుకొచ్చారు.
ఇలా షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ లలో షారుక్ ఖాన్ కి ఆస్తి ఎక్కువగా ఉందని అజయ్ దేవగణ్ చెప్పకనే చెప్పారు.