అమెరికా అధ్యక్షుడు కొడుకు ఏం చేస్తాడో తెలుసా!

గత నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ఫలితాలు వెలువడడంతో అందరూ ఊహించిన రీతిలోనే అమెరికా అధ్యక్షుడు గా కొనసాగుతున్న డోనాల్డ్ ట్రంప్ పై భారీ విజయంతో డెమొక్రటిక్ పార్టీ అధినేత జో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టారు.డోనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీ గా నిలిచి చివరకు అధికార పీఠాన్ని దక్కించుకున్నాడు.

 Son , American President ,died Of Cancer,caught In A Dope Test,painter,-TeluguStop.com

అమెరికా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.జో బైడెన్ అధ్యక్షుడు గా ఎన్నిక కావడం కంటే ట్రంప్ ను ఓడించడం పైనే ఎంతో ఆసక్తిని కనబర్చారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఎవరు? ఇతన్ని గెలిపించడానికి ఎందుకు మక్కువ చూపారు? అతని రాజకీయ ప్రస్థానం ఏమిటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా రాజకీయాలలోకి వచ్చిన వారికి ఎంతో పలుకుబడి లేదా రాజకీయం తరతరాలుగా వస్తున్న వారసత్వంగా అయినా ఉండవచ్చు.

అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఉన్నతస్థానంలో ఉంటారని ప్రతి ఒక్కరూ ఊహించుకుంటారు.కానీ జో బైడెన్ విషయంలో అలా అనుకుంటే మాత్రం మనం పొరపాటు పడినట్టే.

బైడెన్ రాజకీయ జీవితంలో కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.జో బైడెన్ కు ఇద్దరు కుమారులు కాగా వారిలో ఎవరూ కూడా రాజకీయ రంగం వైపు రాలేదు.

బైడెన్ కుమారుడు ఒక సాధారణమైన పెయింటర్ జీవితాన్ని జీవిస్తున్నాడు అంటే ఎవరికి కూడా నమ్మశక్యంగా ఉండదు.బైడెన్ ఇద్దరు కుమారులలో ఒకరికి 2015వ సంవత్సరంలో క్యాన్సర్ తో మృతి చెందాడు.

తండ్రి వారసుడిగా రాజకీయరంగంలోకి ప్రవేశించాలనుకున్న తన కుమారుడు క్యాన్సర్ బారినపడి మృతి చెందాడు.మరొక కుమారుడు హంటర్ డ్రగ్స్ కు బానిసయి డోప్ టెస్టులో పట్టుబడడంతో 2014లో అమెరికా నౌకాదళం రిజర్వు నుంచి తొలగించబడ్డాడు.

కొద్దిరోజుల తర్వాత ఈ డ్రగ్స్ కేసు నుంచి బయటపడి అతను తన తండ్రికి దూరంగా లాస్ ఏంజెల్స్ లోని ఒక సర్వసాధారణమైన పెయింటర్ లాగా తన జీవితాన్ని గడుపుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube