రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చీఫ్ లు మాట్లాడే మాటలకు.పార్టీ బలోపేతానికి సంబంధమే లేదని అంటున్నారు రాజకీయ పండితులు.
వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వచ్చేస్తామంటూ చెప్పడం విచిత్రంగా ఉందంటున్నారు.ఏపీలో అయితే కనీసం అభ్యర్థులు కూడా లేకుండా ఏ కాన్ఫిడెంట్ తో అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు.
ఇక జనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో జనరల్ ఎలక్షన్స్ తొందరగా వచ్చేస్తే బాగుంటుంది.లేకపోతే బీజేపీ చీఫుల ప్రకటనలు వినటానికి చాలా కష్టంగా ఉంటోంది అంటున్నారు.
రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేసేంత సీన్ లేదని అందరికీ తెలుసు.ఈ విషయం బీజేపీ చీఫ్ లతో పాటు నేతలకు కూడా బాగా తెలుసు.
అయినా అధికారంలోకి వచ్చేస్తామంటూ బీరాలు పలుకుతున్నారని అంటున్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా దొరకని బీజేపీ కూడా అధికారంలోకి వచ్చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే ఏపీ చీఫ్ సోమువీర్రాజు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది మాత్రం బీజేపీనే అన్నారు.బీజేపీ యువమోర్చా చేపట్టిన ప్రజా సంఘర్షణ యాత్రకు జనాలు బ్రహ్మరథం పడుతున్నట్లు చెప్పారు.
టీడీపీ కన్నా బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని చెప్తున్నారు.ప్రజాసమస్యల పరిష్కారమయ్యే వరకు తమ పోరాటాలు చేస్తునే ఉంటామని అంటున్నారు.
అసలు బీజేపీ చేస్తున్న పోరాటాలేమిటో చెప్పడం లేదని అంటున్నారు.

ఇక తెలంగాణలో చూస్తే బండి సంజయ్ బీజేపీ ప్రభుత్వం ఫాం చేసేస్తుందన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు.పర్యటనల్లో కేసిఆర్ ని విమర్శించడం.మోడీ ని పొగడటం తప్పా.
ప్రజలకు ఏం చేస్తారో చెప్పిందే లేదు.అయితే తెలంగాణలో బీజేపీ పరిస్ధితి ఏపీలో కన్నా మెరుగ్గా ఉందని మాత్రం చెప్పచ్చు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేస్తే 119 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు దొరకటం అయితే కష్టమనే చెప్పాలి.అందుకనే కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు సీనియర్ నేతలను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.
ఇక ఏపీలో అయితే తమ పార్టీలో చేరమని గేట్లు తెరిచినా అటు వైపు ఎవరూ చూడటం లేదన్నది వాస్తవం.అందుకే ఎన్నికలు వస్తే వీళ్ల గోలైనా తప్పుతుందని అంటున్నారు.