ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ ( Prabhas )ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.అయితే ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేదు.
ఇక ఆ సినిమా తర్వాత రాఘవేంద్ర( Raghavendra ) అనే సినిమా చేశాడు.ఈ సినిమా కూడా ప్రభాస్ కి ఊహించిన ఫలితాన్నైతే ఇవ్వలేదు.
దాంతో మూడోవ సినిమాగా వర్షం సినిమాని( varsham ) స్టార్ట్ చేసి తన ధైన రీతిలో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ, ఆ తర్వాత ఛత్రపతి సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక దీంతో ఆయన స్టార్ హీరో గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే తను మూడో సినిమాగా చేసిన వర్షం సినిమాతో తనని స్టార్ హీరో గా మార్చిన డైరెక్టర్ శోభన్( Director Shobhan ), ప్రస్తుతం మన మధ్య లేరు.
ఆయన చాలా సంవత్సరాల క్రితమే అనాఆరోగ్య సమస్యల వల్ల మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే ప్రభాస్ కి మాత్రం శోభన్ అంటే చాలా ఇష్టం.
ఎందుకంటే తనకి మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి శోభన్ మీద తనకి అమితమైన ఇష్టం ఉండేది.ఇక దానివల్లే ఆయన మన మధ్య లేకపోయినప్పటికి ఆయన కొడుకులు అయిన సంతోష్ శోభన్ , సంగీత్ శోభన్ సినిమాలకి ప్రమోషన్స్ పరంగా ప్రభాస్ తన వంతు సహాయం అందిస్తూ ఉంటాడు.అందుకే ఇప్పటికి కూడా శోభన్ కోసం ప్రభాస్ ఆయన పిల్లలకి ఎంత మేరకైనా సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు… ఇక సంతోష్ శోభన్ కి అయితే వాళ్ల యూవీ క్రియేషన్స్ లోనే సినిమాలు చేసే అవకాశాలు ఇస్తున్నాడు…
.