అష్ట మహాదానాలు అంటే ఏమిటో తెలుసా?

హిందూ సంప్రదాయం ప్రకారం అష్ట మహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది.గరుడ పురాణంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు.

మఖ్యంగా గరుడ పురాణంలోని ఎనిమిదవ అధ్యాయంలో ఈ అష్ట మహాదానాలు అంటే ఏమిటి? వాటి విశిష్టత ఏంటో తెలిపారు.అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అష్ట మహాదానాలు అంటే నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులను దానంగా ఇవ్వడం.అష్ట అంటే ఎనిమిది కానీ ఈ ఏడు కాకుండా ఎనిమిదో దానంగా ఏడు రకాల ధాన్యాలను చేర్చారు.

ఇందులో గోధులు, కందులు, పెసర్లు , శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు ఉన్నాయి.వీటిలో ఏదైనా ఒకదాన్ని లేదా అన్నింటిని కలిపి కూడా దానంగా ఇవ్వవచ్చు.

Advertisement

అయితే నువ్వులు శ్రీ మహా విష్ణులు స్వేదం నుంచి ఉద్భవించాయట.వాటిలో మొత్తం మూడు రకాలుంటాయట.

అందులో ఏవి దానం ఇచ్చినా మంచే జరుగుతుందట.అంతే కాదండోయ్ ఇనుము దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా ఉండచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

అలాగే భూమిని దానం చేయడం వల్ల సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయట.సవర్ణ దానం చేయడం వల్ల బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోష పడతారట.

పత్తిని దానం చేయడం వల్ల యమ భటుల భయం ఉండదట.అలాగే ఉప్పును దానం చేయడం వల్ల యమ ధర్మ రాజు అనుగ్రహం మనపై ఉంటుందట.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025

గోదానంతో వైతరణి నదిని దాటి పోవచ్చట.ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం వల్ల యముడి నివాసానికి రక్షణగా ఉండే వారు ఆనందిస్తారట.ఈ ఎనిమిది దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు