తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దాదాపు 40 సంవత్సరాలనుంచి ఆయన ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు.
కాబట్టి ఇప్పటికీ కూడా ఆయనను బీట్ చేసే హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇక దీనికోసం చిరంజీవి చాలా కసరత్తులను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో ఎలాగైనా చిరంజీవి భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇప్పటికే గత సంవత్సరంలో రెండు సినిమాలను రిలీజ్ చేసినప్పటికీ అందులో వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకోగా, భోళా శంకర్ మాత్రం భారీ డిజాస్టర్ అయ్యింది.ఇక ఆ ప్లాప్ నుంచి బయటపడి ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలి అని చూస్తున్నాడు.డైరెక్టర్ వశిష్ఠ కూడా ఇంతకు ముందు బింబిసార తో మంచి హిట్ ను అందుకున్నాడు.
ఇక ఈ సినిమాతో కూడా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమం లో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
అయితే ఈ సినిమాతో సక్సెస్ ని కనక అందుకున్నట్లైతే చిరంజీవి తన నెక్స్ట్ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో తీయబోతున్నట్టుగా తెలుస్తుంది.అందుకే ఈ సినిమా మీదనే చిరంజీవి నెక్స్ట్ సినిమా కూడా డిపెండ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే తన నెక్స్ట్ సినిమా మారుతితో గాని, హరీష్ శంకర్ తో గాని ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇక వాళ్ళిద్దరితో కాకుండా మరొక కొత్త డైరెక్టర్ తో కూడా సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…