తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ,( Sonia Gandhi ) రాహుల్ గాంధీని( Rahul Gandhi ) కలిశారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.వంద రోజుల పాలనతో పాటు గ్యారెంటీల అమలుపై ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.
నేతల చేరికపై అధిష్టానానికి వివరించిన రేవంత్ రెడ్డి లోక్ సభ అభ్యర్థుల ఎంపిక మరియు ఎన్నికల ప్రచారంపై చర్చలు జరుపుతున్నారని సమాచారం.రేపు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీఈసీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఎంపిక చేయనుంది.