మామూలుగా కోపం రావడం అనేది మనిషి లక్షణం.ఎవరికైనా సందర్భంగా బట్టి కోపం అనేది వస్తుంటుంది.
ఇక కోపం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది.కొందరు వస్తువులపై బాగా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.
మరి కొందరు మనుషులపై చూపిస్తుంటారు.ఇక కొంతమంది ఎంత కోపం వచ్చినా సరే దానిని కంట్రోల్ చేసుకొని సైలెంట్ గా ఉంటారు.
అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది.అయితే హీరో ప్రభాస్ కి కూడా కోపం వస్తే ఆయన వ్యక్తిత్వం కూడా మరోలా ఉంటుందని తెలిసింది.
ఇంతకు అదేంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హోదాకి ఎదిగాడు.టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఇక ఈయనకు ఉన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మొత్తం మారిపోయింది.
అన్ని పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడ్డాడు ఈ యంగ్ రెబల్.ఇక ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చాలావరకు అందరికీ తెలిసిందే.ఎందుకంటే ఆయనతో నటించిన నటీనటులు ఇప్పటివరకు ఆయన గురించి చాలా పాజిటివ్ గా చెప్పారు.నిజానికి ఇతర నటులు చెప్పకున్నా సరే ఆయన ఏంటో ఆయన ఇంటర్వ్యూల వీడియోల ద్వారా చూస్తే అర్థమవుతుంది.
ముఖ్యంగా ఆయన ఇంటి మర్యాదలు మాత్రం వర్ణించలేనిది.తమ ఇంట్లో గోదావరి వంటకాలు స్పెషల్.
ఇక చాలా వరకు తమ ఇంటి వంటకాలను అందరికీ రుచి చూపించాడు ప్రభాస్.తమ ఇంటికి వచ్చిన వారిని కచ్చితంగా కడుపునిండా భోజనం చేయించే పంపిస్తాడట.
అయితే ఇంత మంచి మనస్తత్వం ఉన్న ప్రభాస్ కు కూడా కోపం సహజంగా వస్తూ ఉంటుంది.
అయితే ఆ కోపం ఎలా ఉంటుందో తాజాగా కమెడియన్ ప్రభాస్ శ్రీను తెలిపాడు.ప్రభాస్ శ్రీను గురించి అందరికీ తెలిసిందే.ఈయనకు ప్రభాస్ అంటే చాలా అమితమైన గౌరవం కాబట్టి ఆయన పేరును తన పేరులో చేర్చుకున్నాడు.
ప్రభాస్ శీను చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈయన ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ గురించి ఏదో ఒక విషయాన్ని బయట పెడతాడు.
అయితే ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.అందులో ఆయన ప్రభాస్ కోపాన్ని గురించి ఒక విషయాన్ని తెలిపాడు.
ప్రభాస్ కి కోపం వస్తే అది ఒక వైలెంట్ అని అన్నాడు.అంతేకాకుండా ఆయనకు కోపం వస్తే మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడట.
చివరికి కోపంను చూపించిన వ్యక్తినే ప్రభాస్ మౌనాన్ని తట్టుకోలేక ప్రభాస్ దగ్గరికి వెళ్లి మాట్లాడతారట.ఇక ప్రభాస్ శ్రీను చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.