వాట్సాప్ లో ఉండే టాప్ ప్రైవసీ ఫీచర్స్ ఏంటో మీకు తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ గా వాట్సప్( WhatsApp )ఎంతో ఆదరణ పొందుతోంది.

వాట్సప్ తమ యూజర్లకు సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రక్షణ కల్పిస్తోంది.

వాట్సాప్ లో ఉం)డే టాప్ ప్రైవసీ ఫీచర్స్ ఏంటో చూద్దాం.యాప్ లాక్ ఫీచర్: ఈ ఫీచర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.వాట్సప్ యాప్ కి ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకోవచ్చు.

వాట్సాప్ ని ప్రైవేట్ గా ఉంచుకోవడానికి ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫింగర్ ప్రింట్ లాక్ ని ఎనేబుల్ చేస్తే ఈ ఫీచర్ ఆక్టివేట్ అవుతుందని చాలామందికి తెలిసిందే.

చాట్ లాక్ ఫీచర్:

ఈ ఫీచర్ లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చింది.వాట్సప్ యూజర్లు తమకు నచ్చిన చాట్ ని లాక్ చేసుకోవచ్చు.

Advertisement
Do You Know What Are The Top Privacy Features In WhatsApp, WhatsApp , Privacy Fe

ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్నాక చాట్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంటే, చాట్ లోని ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి చాట్ లాక్ ఫీచర్ పై ట్యాప్ చేయాలి.

బ్లాక్ కాంటాక్ట్స్:

గుర్తుతెలియని నెంబర్లనుండి కాల్స్ రాకుండా ఈ ఫీచర్ తో బ్లాక్ చేయొచ్చు లేదంటే సైలెంట్ లో పెట్టుకోవచ్చు.

హైడ్ స్టేటస్:

యూజర్లు తమ ప్రొఫైల్ స్టేటస్, ప్రోఫైల్ పిక్చర్(Profile picture, లాస్ట్ సీన్ లాంటివి ఇతరులకు కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు.

Do You Know What Are The Top Privacy Features In Whatsapp, Whatsapp , Privacy Fe

పర్మిషన్:

ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకుంటే, ఇతరులు మిమ్మల్ని ఏదైనా గ్రూప్ లో యాడ్ చేయాలి అనుకుంటే ముందుగా మీ పర్మిషన్ తీసుకోవలసి ఉంటుంది.

రీడ్ రిసీప్ట్స్:

ఇతరులు పంపించిన మెసేజ్ ని ఓపెన్ చేస్తే బ్లూ టిక్స్ పడతాయి.ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే మెసేజ్ చూసినా కూడా బ్లూ టిక్స్ కనిపించవు.

టూ స్టెప్ వెరిఫికేషన్: ఈ ఫీచర్ యూజర్లకు ఎంతో భద్రత ఇస్తుంది.ఈ ఫీచర్( Two step verificatio n) ఎనేబుల్ చేసుకుంటే ఇతరులు లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉండదు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

పాస్వర్డ్ సెట్ చేసుకుంటే వాట్సాప్ చాలా సురక్షితంగా ఉంటుంది.

Advertisement

ఆటోమేటిక్ డిలీట్:

ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకుంటే సెటప్ చేసిన గడువు ముగియగానే చాట్ లోని మెసేజ్లు వాటి అంతట అవే డిలీట్ అవుతాయి.

తాజా వార్తలు