మనం అనునిత్యం యూట్యూబ్ ( Youtube )వినియోగిస్తుంటాం.మనకు ఏదైనా తెలియని విషయాల గురించి తెలుసుకోవాలన్నా, సినిమాలు లేదా సీరియల్స్ చూడాలన్నా, న్యూస్ ఛానల్స్ వీక్షించాలన్నా మనకు సరైన ఆప్షన్ యూట్యూబ్ మాత్రమే.
అంతేకాకుండా మహిళలు చాలా మంది వివిధ రకాల వంటకాలు యూట్యూబ్ చూస్తూ వండేస్తారు.అయితే యూట్యూబ్ చూసే క్రమంలో చాలా మందికి ఇందులోని ట్రిక్స్ తెలియవు.
అందువల్ల ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.దీని వల్ల చిన్న పాటి ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తూనే యూట్యూబ్ వినియోగిస్తుంటారు.
అయితే ఆ ట్రిక్స్ తెలుసుకుంటే యూట్యూబ్ చూసేటప్పుడు మీకు ఎటువంటి సమస్యలు ఉండవు.చక్కగా ఎంజాయ్ చేస్తూ యూట్యూబ్ చూడొచ్చు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

యూట్యూబ్‌ను నిరంతరాయంగా చూస్తే ఒక్కోసారి మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు మర్చిపోతుంటాం.ఇందుకు ఒక చిట్కా ఉంది.యూట్యూబ్‌లో ఉండే సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
అనంతరం అక్కడ కనిపించే జనరల్‌పై క్లిక్ చేయాలి.తర్వాత మనకు ‘రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్’( Remind Me To Take A Break ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దీనిని ఎనేబుల్ చేయాలి.తర్వాత యూబ్యూబ్ మీరు ఎంత సేపు చూడాలనుకుంటున్నారో టైమ్ సెట్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒక గంట మీరు టైమ్ సెట్ చేసుకుంటే ఆ సమయంలో పూర్తైన తర్వాత ‘టైమ్ టు టేక్ ఓ బ్రేక్’ ( Time to take a break )పేరుతో ఒక అలర్ట్ మీ ఫోన్‌లో వస్తుంది.మరో ట్రిక్ గురించి పరిశీలిస్తే యూట్యూబ్‌ను మనం క్లోజ్ చేస్తే దానిలో ప్లే అయ్యే వీడియో కూడా వెంటనే ఆగిపోతుంది.

యూట్యూబ్ క్లోజ్ చేసి ఇంకో యాప్ యూజ్ చేస్తున్నా మనం చూసే వీడియో ఆగకుండా ఉండేందుకు ఒక ఆప్షన్ ఉంది.దీని కోసం గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి అక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు త్రీ డాట్స్ కనిపిస్తాయి.వాటిపై క్లిక్ చేస్తే డెస్క్ టాప్ సైట్ అని కనిపిస్తుంది.దానిని సెలెక్ట్ చేసుకోవాలి.దాని వల్ల మీరు యూట్యూబ్ క్లోజ్ చేసినా దానిలో ప్లే అయ్యే వీడియో కంటిన్యూగా చూడొచ్చు.దీనితో పాటు యూట్యూబ్ ఓపెన్ చేయగానే దానిని ల్యాండ్ స్కేప్‌లోకి ప్రతి సారీ మార్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది.
దీని కోసం యూట్యూబ్ సెట్టింగ్స్‌లో ఒక ఆప్షన్ ఉంది.అందులో జూల్ టూ ఫుల్ స్క్రీన్ ఆప్షన్‌ను మనం ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.
మనం ఫోన్ తిప్పగానే దానికి అనువుగా చూసే వీడియో కూడా పెద్దది అవుతుంది.