సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి చిత్రం భీమ్లా నాయక్.మలయాళ సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇక ఈ సినిమాలో లాలా భీమ్లా.అడవి పులి గొడవపడి’ అంటూ సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్రను తెలియజేసేలా ఎంతో అద్భుతమైన పాటను రూపొందించారు.
ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాలోని మూడవ పాట సౌండ్ ఆఫ్ భీమ్లా నాయక్ పేరుతో ఆదివారం విడుదల చేశారు.
ఈ పాట విడుదల చేసిన కొంత సమయానికి సోషల్ మీడియాలో అధిక వ్యూస్ దక్కించుకొని దూసుకుపోతుంది.
తమన్ అందించిన సంగీతానికి అరుణ్ కౌండిన్య ఉర్రూతలూగించేలా అలపించారు.అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ పాటను చిత్రీకరించారు.
ఇక ఈ సినిమాలో ఈ పాటలో నటించడానికి ఒరిస్సా నుంచి 30 మంది మహిళ నృత్య కళాకారులు పాల్గొన్నారు.సినిమాలోని కొన్ని విజువల్స్ మిక్స్ చేసి ఈ పాటను రూపొందించారు.

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.ఇక ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ పాత్రలో నటించగా రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.