శబరిమల 18 మెట్ల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

కార్తీకమాసం మొదలవగానే చాలామంది అయ్యప్ప మాలలు ధరించి ఎంతో పరమపవిత్రంగా కఠిన నియమాలతో దీక్షలో ఉంటారు.

ఈ క్రమంలోనే చాలా కఠిన నియమాలతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు.

స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ స్వామివారిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.మాల దీక్ష అనంతరం భక్తులు కేరళలో ఉన్నటువంటి శబరి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడం చేస్తారు.

శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామి 18 కొండలు, 18 పది మెట్లు ఎక్కి కొలువై ఉండి భక్తులను దర్శనమిస్తుంటారు.స్వామివారి ఆలయంలో ఉన్న ఈ 18 మెట్లను భక్తులు ఎంతో పవిత్రమైన మెట్లుగా భావించి ఆ మెట్లకి పూజలు చేస్తారు.

ఆ 18 మెట్లను ఎక్కి భక్తులు స్వామి వారిని పూజించుకుంటారు.ఇలా మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకున్న వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు.

Advertisement
Do You Know The Significance Of Sabarimala 18 Steps Sabarimala,18 Steps, Signifi

శబరి ఆలయంలో ఉన్న ఈ మెట్లు ఎంతో పవిత్రమైనదని 18 మెట్లకు ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతుంటారు.మరి ఆ 18 మెట్ల ప్రాధాన్యత ఏమిటి అనే విషయానికి వస్తే.

Do You Know The Significance Of Sabarimala 18 Steps Sabarimala,18 Steps, Signifi

స్వామి వారి ఆలయంలో నిర్మించి ఉన్న ఈ పద్దెనిమిది మెట్లు గ్రానైట్ తో నిర్మితమైనవి.అనంతరం ఆ మెట్లకు పంచలోహాలతో పూత పూసారు.ఈ 18 మెట్లను ఎక్కేవారు ముందుగా కుడి కాలు పెట్టి మెట్లు ఎక్కాలి.

ఇలా స్వామి వారి సన్నిధిలో ఉన్న ఈ 18 మెట్లలో తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలకు సంబంధించినవి అని చెబుతారు.ఆ తరువాత ఎనిమిది మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి.

ఆ తరువాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినదిగా భావిస్తారు.ఇక మిగిలిన రెండు మెట్లను జ్ఞానం అజ్ఞానాన్ని సూచిస్తాయి.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!

ఇలా 18 మెట్లు 18 రకాల విశిష్టతలను కలిగి ఉన్నాయి.ఎవరైతే ఈ మెట్లు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకొంటారు వారికి అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు