బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి షారుక్ ఖాన్ క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి షారుఖ్ ఖాన్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈయన నివాసం ఉంటున్న ఇంటికి మన్నత్ అనే పేరు పెట్టుకున్నారు.ఇక ఈ ఇంటి ముందు ఎప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.
ఇకపోతే నటుడు షారుఖ్ ఖాన్ కు మన్నత్ అంటే ఎంత ఇష్టమో ఇప్పటికే పలుమార్లు ఈ ఇంటిపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేశారు.

షారుక్ ఖాన్ 1998లో ఎస్ బాస్ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఈ ఇంటిని చూశారట అయితే ఆ క్షణమే ఇంటిని సొంతం చేసుకోవాలని షారుక్ భావించారు.అయితే షారుఖ్ ఖాన్ మాత్రం ఈ బంగ్లాను 2001లో కొనుగోలు చేసినట్టు సమాచారం.షారుక్ ఖాన్ అప్పట్లో ఇంటిని సుమారు 13 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇలా 13 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ఇంటికి షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ స్పెషల్ గా ఇంటీరియర్ డిజైన్ చేయించి మరింత అందంగా తీర్చిదిద్దారు.

ఇలా 13 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ ఇంటికి మొదట్లో జిన్నత్ అనే నామకరణం చేశారు.అనంతరం ఈ పేరును మన్నత్ గా మార్చారు.ఇలా 2001లో 13 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తున్న ఈ ఇంటి ధర ప్రస్తుతం ఏకంగా 200 కోట్ల రూపాయల విలువ చేస్తుందని సమాచారం.
ఇలా ఈ ఇంటి విలువ భారీగా పెరిగిపోయింది.ఇక ఈ విషయం తెలిసిన పలువురు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే షారుఖ్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ ఇంటిని ముందుగా కొనే అవకాశం మరొక నటుడు సల్మాన్ ఖాన్ కి వచ్చినప్పటికీ ఆయన ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో షారుక్ ఈ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.







