బ్రహ్మానందం చిన్న కోడలు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో వందల సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు బ్రహ్మానందం ( Brahmanandam )ఒకరు.తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ పాత్రలలో నటిస్తూ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ పంచ్ డైలాగులతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి.

 Background Of Brahmanandam's Little Sister-in-law ,brahmanandam, Aishwarya ,sidd-TeluguStop.com

కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.ఇక బ్రహ్మానందం వృత్తి పరమైన జీవితం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయనకు ఇద్దరు అబ్బాయిలు అనే విషయం మనకు తెలిసిందే.

Telugu Aishwarya, Brahmanandam, Gautham, Siddharth, Sister Law, Tollywood-Movie

వీరి పెద్ద కుమారుడు గౌతమ్( Gautham ) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించారు.అయితే ఈయన పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.ఇక చిన్న కుమారుడు సిద్ధార్థ్ ( Siddharth ) ఈయన విదేశాలలో స్థిరపడ్డారు.అయితే గత కొద్ది రోజుల క్రితం బ్రహ్మానందం తన చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం( Engagement ) ఎంతో అంగరంగ వైభవంగా జరిపించిన విషయం మనకు తెలిసిందే.

సిద్ధార్థ్ ఐశ్వర్య( Aishwarya) అనే అమ్మాయితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.వీరిద్దరిది పెద్దలు కుదుర్చున వివాహం.

Telugu Aishwarya, Brahmanandam, Gautham, Siddharth, Sister Law, Tollywood-Movie

ఇలా బ్రహ్మానందం చిన్న కుమారుడి పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో తనకు కాబోయే కోడలు బ్యాగ్రౌండ్ ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.అయితే బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య ప్రముఖ డాక్టర్( Doctor ) అని తెలుస్తుంది.ఈమె కరీంనగర్ లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రం యజమాని డాక్టర్‌ పద్మజ-వినయ్ దంపంతుల ఒక్కగానొక్క కుమార్తె.

తన తల్లి డాక్టర్ కావడంతో ఐశ్వర్య సైతం తన తల్లి బాటలోనే పయనిస్తూ వైద్య వృత్తిని అభ్యసించారు.గైనకాలజీ, ఫర్టిలిటీలో స్పెషలైజేషన్ చేసింది.కుందనపు బొమ్మలా ఉండే ఐశ్వర్య పేరిట ఇప్పటికే ఆమె తల్లిదండ్రులు కొన్ని కోట్ల ఆస్తులను కూడబెట్టారనీ ఈమె పేరిట భారీగానే ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.ఏది ఏమైనా బ్రహ్మానందం చిన్న కోడలు బ్యాగ్రౌండ్ భారీగానే ఉందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube